హైదరాబాద్: ఎవరు తీసిన గోతిలో వారే పడతారని తెలంగాణ సీఎం కేసీఆర్ ను లక్ష్యంగా చేసుకొని కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ విజయశాంతి విమర్శలు గుప్పించారు.

సోషల్ మీడియా వేదికగా ఆమె కేసీఆర్ పై విమర్శలు చేశారు. కాంగ్రెస్ నేతలను  కొందరిని ప్రలోభపెట్టి, మరికొందరిని భయపెట్టిన ఒత్తిళ్లతో పార్టీని మార్పించారని ఆమె ఆరోపించారు.

 

ఎవరు తీసుకున్న గోతిలో వారే పడతారన్న సామెత సీఎం కేసీఆర్ గారికి సరిగ్గా వర్తించే సమయం సమీపించింది. కాంగ్రెస్ నేతలు...

దీనిలో Vijayashanthi పోస్ట్ చేసారు 7, నవంబర్ 2020, శనివారం

 

 

కాంగ్రెస్ ను బలహీనపర్చే చర్యల వల్ల ఇప్పుడు బీజేపీ తెలంగాణలో సవాల్ విసిరే స్థాయికి వచ్చిందని ఆమె వ్యాఖ్యానించారు. మాణికం ఠాగూర్ ఇంకా కొంచెం ముందు రాష్ట్ర వ్యవహరాల ఇంచార్జీగా వచ్చి ఉంటే పరిస్థితులు ఇంకా మెరుగ్గా ఉండేవని ఆమె అభిప్రాయపడ్డారు.

also read:ఇంటికి వెళ్లి విజయశాంతిని కలిసిన మాణిక్యం ఠాగూర్

భవిష్యత్ పరిణామాలను కాలం, ప్రజలే నిర్ణయిస్తారని ఆమె చెప్పారు. కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కుసుమకుమార్ చర్చల తర్వాత విజయశాంతి పార్టీ నాయకత్వంపై అలకను వీడినట్టుగా పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

also read:విజయశాంతి బిెజెపిలో ఎప్పుడు చేరుతోందో తెలియదు: బండి సంజయ్

విజయశాంతితో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గత మాసంలో భేటీ అయ్యారు. ఆమె కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి బీజేపీలో చేరుతారనే ప్రచారం కూడ సాగింది. అయితే కుసుమకుమార్ భేటీ తర్వాత ఆమె కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలకు ఎందుకు దూరంగా ఉండాల్సి వచ్చిందో  వివరించినట్టుగా తెలుస్తోంది.