శ్రీశైలం పవర్ ప్లాంట్ లో అగ్ని ప్రమాదానికి గల కారణాలపై సీఐడీ లోతుగా దర్యాప్తు చేస్తోంది. ఫైర్ సేఫ్టీ నిబంధనలను పాటించలేదని సీఐడీ గుర్తించింది. దీంతో తొలుత నమోదు చేసిన ఎఫ్ఐఆర్ లో సీఐడీ మార్పులు చేసింది. పలు సెక్షన్లను అదనంగా సీఐడీ చేర్చింది.
శ్రీశైలం: శ్రీశైలం పవర్ ప్లాంట్ లో అగ్ని ప్రమాదానికి గల కారణాలపై సీఐడీ లోతుగా దర్యాప్తు చేస్తోంది. ఫైర్ సేఫ్టీ నిబంధనలను పాటించలేదని సీఐడీ గుర్తించింది. దీంతో తొలుత నమోదు చేసిన ఎఫ్ఐఆర్ లో సీఐడీ మార్పులు చేసింది. పలు సెక్షన్లను అదనంగా సీఐడీ చేర్చింది.
శ్రీశైలం పవర్ ప్లాంట్ లో సిబ్బంది, నిర్వహణ లోపాలపై సీఐడీ ప్రధానంగా కేంద్రీకరించింది. శ్రీశైలం పవర్ ప్లాంట్ లో అగ్ని ప్రమాదానికి గల కారణాలపై సీఐడీ విశ్లేషిస్తోంది. పవర్ ప్లాంట్ లో సరైన రక్షణ చర్యలు లేవనే విషయాన్ని కూడ సీఐడీ గుర్తించింది.
శ్రీశైలం పవర్ ప్లాంట్ లో అత్యాధునిక అగ్ని మాపక యంత్రాలను ఎందుకు అందుబాటులో ఉంచకపోవడం వల్ల ప్రమాద తీవ్రత మరింత పెరిగిందని సీఐడీ అభిప్రాయపడింది.
పవర్ ప్లాంట్ లో చోటు చేసుకొన్న అగ్ని ప్రమాదంలో కాలిపోయిన వైర్లతో పాటు ఇతర వస్తువులను ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపారు. ఈ రిపోర్టు కోసం సీఐడీ ఎదురు చూస్తోంది. మరో వైపు శ్రీశైలం పవర్ ప్లాంట్ ను మరోసారి సీఐడీ అధికారులు పరిశీలించనున్నారు.
also read:శ్రీశైలం పవర్ హౌస్‌లో అగ్ని ప్రమాదం: కీలక సమాచారం సేకరించిన సీఐడీ
ఈ నెల 25వ తేదీన శ్రీశైలం అగ్ని ప్రమాదంలో గాయపడిన వారిని సీఐడీ బృందం ప్రశ్నించింది. వారి నుండి కీలక సమాచారాన్ని సేకరించింది. రెండు టర్బైన్లలో అగ్ని ప్రమాదం చోటుచేసుకొన్న తర్వాత మిగిలిన యూనిట్లలో విద్యుత్ ఉత్పత్తిని ఎందుకు నిలిపివేయలేదనే విషయాన్ని కూడ సీఐడీ పరిశీలిస్తోంది.
దాదాపుగా రెండేళ్లుగా బ్యాటరీలు మార్చాలనే ప్రతిపాదనలు ఉన్నా కూడ ఎందుకు మార్చలేదు.. రాత్రి పూటే బ్యాటరీలు మార్చాల్సిన అవసరం ఎందుకు వచ్చిందనే విషయమై కూడ సీఐడీ దర్యాప్తు చేస్తోంది.
