ఉద్యోగాల పేరుతో రూ. 720 కోట్ల మోసం: గుజరాత్‌కు చెందిన ప్రజాపతిపై ఈడీ కేసు

గుజరాత్ రాష్ట్రానికి చెందిన   ప్రకాష్‌ ముల్‌చంద్ బాయ్  ప్రజాపతిపై ఈడీ అధికారులు కేసు నమోదు చేశారు.

Chinese investment fraud accused Prajapati booked under PMLA lns

హైదరాబాద్: గుజరాత్ రాష్ట్రానికి చెందిన  ప్రకాష్  ముల్‌చంద్ బాయ్ ప్రజా పతిపై  ఈడీ అధికారులు కేసు నమోదు చేశారు.మనీలాండరింగ్  చట్టం కింద  ఈడీ కేసు నమోదు చేసింది.  హైద్రాబాద్ లోని  ఈడీ  కార్యాలయం  ఈ మేరకు  ప్రజాపతితో పాటు ఆయన  గ్యాంగ్ పై  కేసు కేసు నమోదు చేసింది.  ఇండియాతో పాటు  పలు దేశాల్లో  ప్రజాపతిపై కేసులు నమోదయ్యాయి.  తెలంగాణలోని  హైద్రాబాద్, సైబరాబాద్, రాచకొండ  పోలీస్ కమిషనరేట్ల పరిధిలో  ప్రజాపతిపై  వందల కేసులు నమోదయ్యాయి. .హైద్రాబాద్ నగరంలోని మూడు పోలీస్ కమిషనరేట్ల పరిధిలో నమోదైన  కేసుల వివరాలను  ఈడీ అధికారులు సేకరిస్తున్నారు.
 
సోషల్ మీడియా ద్వారా పార్ట్ టైమ్ జాబ్ ల పేరుతో  ఆకర్షించేవాడు  ప్రజాపతి ముఠా.  సింపుల్ టాస్క్ ఇచ్చేవారు.  యూట్యూబ్ వీడియోలకు  రివ్యూలు , గూగుల్ రేటింగ్ వంటి టాస్కులు ఇచ్చేవారు.  ఈ టాస్కులు పూర్తి చేసిన వారిని  డబ్బులు  పెట్టుబడి పెట్టాలని కోరేవారు. అధిక వడ్డీ ఆశ చూపేవారు. అయితే  ఆ తర్వాత  కొంత కాలానికి పెట్టిన పెట్టుబడి కూడ  వారికి తిరిగి వచ్చేది కాదు. మోసపోయిన బాధితులు  పోలీసులకు  ఫిర్యాదు చేశారు.

  ప్రజాపతి గ్యాంగ్ ఉపయోగించిన  45 బ్యాంకు ఖాతాలను  హైద్రాబాద్ సీసీఎస్ పోలీసులు గుర్తించారు. ఒకే చిరునామాతో ఈ బ్యాంకు ఖాతాలను గుర్తించారు. ఈ నిధులు  దుబాయ్ మీదుగా చైనాకు మళ్లించినట్టుగా దర్యాప్తు సంస్థ గుర్తించింది.ప్రజాపతికి ఇండియాలో వ్యక్తిగతంగా ఉన్న ఆస్తుల గురించి కూడ ఈడీ అధికారులు ఆరా తీస్తున్నారు. దుబాయ్ నుండే  ప్రజాపతి ముఠా  ఈ మోసాలకు  పాల్పడుతున్నట్టుగా  అధికారులు గుర్తించారు.   నిందితులు ఉపయోగించిన కంప్యూటర్ల  ఐపీ అడ్రస్ లు దుబాయ్ కి చెందినవిగా  అధికారులు తేల్చారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios