క్యాసినో నిర్వహాకుడు చికోటి ప్రవీణ్ కుమార్‌పై ఈడీ దాడులు జరపడం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. తాజాగా విచారణకు రావాలంటూ.. ప్రవీణ్, మాధవరెడ్డిలకు ఈడీ నోటీసులు జారీ చేసింది. అయితే తనకు ఈడీ నోటీసులు జారీచేయడంపై చికోటి ప్రవీణ్ కుమార్ స్పందించారు.
క్యాసినో నిర్వహాకుడు చికోటి ప్రవీణ్ కుమార్‌పై ఈడీ దాడులు జరపడం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. ప్రత్యేక ఈవెంట్ల పేరుతో జూదం ఆడించేందుకు పలువురు విదేశాలకు తరలిస్తున్న.. ప్రవీణ్ కుమార్ చికోటి, మాధవరెడ్డి తదితర ఏజెంట్లపై ఈడీ ఎనిమిది చోట్ల సోదాలు నిర్వహించింది. సోదాలు ముగిసిన అనంతరం విచారణకు రావాలంటూ.. ప్రవీణ్, మాధవరెడ్డిలకు ఈడీ నోటీసులు జారీ చేసింది. అయితే తనకు ఈడీ నోటీసులు జారీచేయడంపై చికోటి ప్రవీణ్ కుమార్ స్పందించారు.
ఈడీ అధికారులు తనకు నోటీసులు ఇచ్చారని చికోటి ప్రవీణ్ కుమార్ వెల్లడించారు. సోమవారం విచారణకు హాజరవుతానని చెప్పారు. అక్కడ అధికారులకు తన వివరణ ఇస్తానని తెలిపారు. గోవాలో, నేపాల్‌లో క్యాసినో లీగల్ అని.. అందుకే అక్కడ నిర్వహించామని చెప్పారు.
Also Read: క్యాసినో మాధవరెడ్డి కారుపై ఎమ్మెల్యే స్టిక్కర్.. వివాదంలో మంత్రి మల్లారెడ్డి.. ఆయన రియాక్షన్ ఇదే..
అయితే ఈ క్యాసినో వ్యవహారానికి సంబంధించి.. ఈడీ ఫారిన్ ఎక్స్ఛేంజ్ మేనేజ్‌మెంట్ యాక్ట్ (ఫెమా)ను ఉల్లంఘనలపై దృష్టి సారించింది. ఈ మేరకుఈడీ అభియోగాలు మోపింది. బుధవారం నిర్వహించిన సోదాల్లో.. ఇందుకు సంబంధించి ఈడీ అధికారులు పలు ఆధారాలు సేకరించినట్టుగా తెలుస్తోంది. అదే సమయంలో ప్రముఖులు, సెలబ్రిటీలతో ప్రవీణ్‌కు సంబంధాలున్నట్లు ఈడీ అధికారులు గుర్తించారు. వారితో ప్రవీణ్ ప్రమోషన్ వీడియోలు చేయించారని.. ఇందుకు సంబంధించిన లావాదేవీలపై కూడా ఈడీ అధికారులు ఆరా తీస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే నేపాల్‌లొ జూదం చట్టబద్ధమైనప్పటికీ.. పంటర్లు, ఏజెంట్లు చేసిన ఆర్థిక లావాదేవీలు చట్టవిరుద్ధమని ఈడీ వర్గాలు చెబుతున్నాయి. ఇక, ప్రవీణ్ కుమార్ కస్టమర్ల లిస్ట్‌లో తెలుగు రాష్ట్రాలకు చెందిన కొందరు ప్రజాప్రతినిధులు కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది.
Also Read:విచారణకు రావాలి: చీకోటి ప్రవీణ్ కు ఈడీ నోటీసులు
ఇక, ఆంధ్రప్రదేశ్ తో పాటు తెలంగాణ రాష్ట్రంలో కూడా కేసీనో వ్యవహరంలో ప్రవీణ్ పై ఆరోపణలున్నాయి. గుడివాడలో ప్రవీణ్ కేసినో నిర్వహించారనే ఆరోపణలు వచ్చాయి. అయితే గుడివాడలో కేసినో నిర్వహించలేదని ప్రవీణ్ తేల్చి చెప్పారు. ఈ విషయమై తనపై టీడీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.
