Asianet News TeluguAsianet News Telugu

విచారణకు రావాలి: చీకోటి ప్రవీణ్ కు ఈడీ నోటీసులు

కేసీనో వ్యవహరంలో విచారణకు రావాలని చీకోటి ప్రవీణ్ కు ఈడీ అధికారులు నోటీసులు పంపారు. ఆగస్టు ఒకటో తేదిన విచారణకు రావాలని ఆదేశించారు. 

Enforcement Directorate Serves Notice To Cikoti Praveen
Author
Hyderabad, First Published Jul 28, 2022, 11:26 AM IST

హైదరాబాద్: Casino వ్యవహరంలో చీకోటి ప్రవీణ్ కుమార్ కు ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఆగష్టు 1వ తేదీన  విచారణకు రావాలని Enforcement Directorate అధికారులు  Chikoti Praveen కు నోటీసులు జారీ చేశారు.  బుధవారం నుండి గురువారం నాడు తెల్లవారుజాము వరకు చీకోటి ప్రవీణ్ తో పాటు మాధవరెడ్డి ఇళ్లలో ఈడీ అధికారులు Raids చేశారు . ఈడీ అధికారుల సోదాల్లో కీలక సమాచారం సేకరించారని తెలుస్తుంది. ఈ విషయమై విచారణ కోసం సోమవారం నాడు రావాలని చీకోటి ప్రవీణ్ కుమార్ కు ఈడీ అధికారులు Notice జారీ చేశారు. 

విదేశాల్లో నిర్వహించిన కేసీనోలకు సంబంధించి సినీ తారలతో ప్రవీణ్ ప్రచారం నిర్వహించారు. సినీ తారలకు డబ్బులు ఎవరు సమకూర్చారనే విషయమై కూడా ఈడీ అధికారులు ఆరా తీశారు. మరోవైపు ప్రవీణ్  విదేశాల్లో ని ఏ ప్రాంతాల్లో కేసినో నిర్వహించారనే విషయమై కూడా ఈడీ అధికారులు దర్యాప్తు చేశారు ప్రముఖులకు చెందిన డబ్బులను హవాలా మార్గంలో ప్రవీణ్ విదేశాలకు తరలించాడని ఈడీ అధికారులు అనుమానిస్తున్నారు.

ఆర్దిక లావాదేవీలకు సంబంధించి ప్రవీణ్ ను ఈడీ అధికారులు ప్రశ్నించనున్నారు. క్రికెట్  బెట్టింగ్స్ తో పాటు కేసినోకు సంబంధించి అంశాలపై ప్రవీణ్ ను ప్రశ్నించే అవకాశం ఉంది. ప్రవీణ్ ఇంట్లో లాప్ టాప్ తో పాటు మొబైల్స్ ను కూడా ఈడీ అధికారులు స్వాధీనం చేసుకొన్నారు. ఫెమా నిబంధనలను ఉల్లంఘించారని ఇప్పటికే ప్రవీణ్ పై కేసు నమోదైంది. నేపాల్ సహా పలు దేశాలకు ప్రముఖులను తీసుకెళ్లి  ప్రవీణ్ కుమార్ కేసీనో ఆడించారనే ఆరోపణలున్నాయి. ప్రవీణ్ నిర్వహించే కేసినోకు  సినీ తారలు ప్రచారం నిర్వహించారు. 

ప్రవీణ్ తో పాటు మాధవరెడ్డి నివాసంలో కూడా ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. సుమారు 20 గంటల పాటు సోదాలు  చేశారు. బుధవారం నాడు ప్రారంభమైన సోదాలు గురువారం నాడు తెల్లవారుజాము వరకు సోదాలు సాగాయి. ప్రవీన్ లాప్ టాప్ లో అనుమానాస్పద లావాదేవీలను  ఈడీ అధికారులు గుర్తించారు.ఈ లావాదేవీలపై  ఈడీ అధికారులు ప్రశ్నించారు. 20 గంటల పాటు ప్రవీణ్, మాధవ రెడ్డి ఇళ్లలో  జరిపిన సోదాల్లో సేకరించిన ఆధారాల బట్టి ఈడీ అధికారులు విచారణ సాగించనున్నారు.

ఆంధ్రప్రదేశ్ తో పాటు తెలంగాణ రాష్ట్రంలో కూడా  కేసీనో వ్యవహరంలో ప్రవీణ్ పై ఆరోపణలున్నాయి. గుడివాడలో ప్రవీణ్ కేసినో నిర్వహించారనే ఆరోపణలు వచ్చాయి. అయితే గుడివాడలో కేసినో నిర్వహించలేదని ప్రవీణ్ తేల్చి చెప్పారు. ఈ విషయమై తనపై టీడీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.

also read:చీకోటి ప్రవీణ్ ,మాధవరెడ్డి ఇళ్లలో ముగిసిన ఈడీ సోదాలు: లాప్ టాప్, మొబైల్ సీజ్

హైద్రాబాద్ నగరానికి శివారులో ఉన్న  ఓ హీరో ఫామ్ హౌస్ లో నిర్వహించిన కేసినో కు కూడా ప్రవీణ్ కు సంబంధాలున్నాయనే ఆరోపణలు అప్పట్లో వచ్చాయి. అయితే హైద్రాబాద్ లో కేసినో నిర్వహణ కు ఇబ్బందులు ఏర్పడడంతో విదేశాల్లో కేసినో నిర్వహించారని అధికారులు గుర్తించారు. ప్రతి వీకేండ్ లో విమానాల్లో ప్రముఖులను విదేశాలకు తీసుకెళ్లి కేసినో నిర్వహించారని అధికారులు గుర్తించారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios