తెలంగాణలో కొండెక్కిన చికెన్ ధరలు.. మాంసం ప్రియులకు చుక్కలు..
రోజురోజుకు పెరుగుతున్న Chicken ధరలు మాంసం ప్రియులకు షాక్ ఇస్తున్నాయి. గత రెండు నెలలుగా ధరలు పెరుగుతూనే వస్తున్నాయి. శ్రావణమాసంలో అయిన చికెన్ రేటు తగ్గుతుందని భావించినప్పటికీ.. ధరలు ఏ మాత్రం తగ్గలేదు.
ఇప్పటికే పెరిగిన పెట్రోల్, గ్యాస్, నిత్యావసరాల ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. ఇదిలా ఉంటే గత కొద్ది రోజులుగా తెలంగాణలో చికెన్ ధరలు కొండెక్కాయి. రోజురోజుకు పెరుగుతున్న Chicken ధరలు మాంసం ప్రియులకు షాక్ ఇస్తున్నాయి. గత రెండు నెలలుగా ధరలు పెరుగుతూనే వస్తున్నాయి. శ్రావణమాసంలో అయిన చికెన్ రేటు తగ్గుతుందని భావించినప్పటికీ.. ధరలు ఏ మాత్రం తగ్గలేదు. తాజాగా ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ కావడంతో Chicken Price మరింతగా పెరిగింది. శ్రావణమాసంలో కిలో చికెన్ ధర.. రూ. 250గా ఉంది. తాజాగా ఇది మరింతగా పెరిగింది. ప్రస్తుతం కిలో చికెన్ మార్కెట్‌లో రూ.280 నుంచి రూ.300లు పలుకుతుంది.
మాములుగా రిటైల్ లైవ్ బర్డ్ కిలో రూ.80 నుంచి రూ.100వరకు ఉండేది. అయితే ప్రస్తుతం రూ.145 నుంచి రూ.150వరకు పలుకుతోంది. ఉత్పత్తి తగ్గడం, కొనుగోళ్లు పెరగడంతో ధరలు అమాంతం పెరిగినట్టుగా తెలుస్తోంది. కరోనా వ్యాప్తి కాలంలో మాంసాహారం తినాలన్న ప్రచారం సాగడంతో చాలా మంది చికెన్, మటన్‌లు తినడం ఎక్కువ చేశారు. ఈ క్రమంలోనే మంసాహారం వినియోగం పెరిగింది. మరో వైపు కిలో మటన్ ధర కొన్ని చోట్ల రూ. 700 వరకు పలుకుతుంది.
గుడ్డు ధరలు.. చికెన్, మటన్ ధరలే కాకుండా గుడ్డు ధరలు కూడా షాక్ ఇస్తున్నాయనే చెప్పాలి. సాధారణంగా రూ. 4 విక్రయించే గుడ్డు ధర.. రూ. 6కి పెరిగింది. దీంతో రోజు తమ డైట్‌లో భాగంగా గుడ్లను వినియోగించేవారికి ఇబ్బంది అనే చెప్పాలి.
Also read: పోలీసుల ప్రతాపం.. తలనీలాలివ్వడానికి యాదాద్రికి వెళ్లిన దివ్యాంగుడి మృతి...
మరోవైపు మార్కెట్‌లో కూరగాయల ధరలు కూడా సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. 10 రోజుల క్రితం వరకు నార్మల్‌గా ఉన్న కూరగాయలు రేట్లు క్రమంగా పెరిగాయి. ముఖ్యంగా ఉల్లి, టమోటా ధరలు భారీగా పెరిగాయి. అయితే ఈ ధరలు మరింతగా పెరుగుతాయనే వార్తలు సామాన్యులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. అయితే ప్రస్తుతం కొన్ని రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురవడం, పంట దెబ్బతినడం వల్లే రేట్లు పెరిగాయని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఇక, ఉల్లి ధరలు దీపావళి వరకు అధికంగానే ఉండే అవకాశాలు ఉన్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. దీంతో పరిస్థితులు ఏం కొనేట్టు లేదు.. ఏం తినేట్టు లేదు అన్నా చందనా తయారయ్యాయి.