Asianet News TeluguAsianet News Telugu

చెన్న‌మ‌నేని ర‌మేష్ బాబు ఎమ్మెల్యే ప‌ద‌వికి అన‌ర్హుడు.. హైకోర్టుకు తేల్చిచెప్పిన కేంద్ర ప్ర‌భుత్వం

చెన్నమనేని రమేష్ బాబుకు శాసనసభ్యుడిగా కొనసాగే అర్హత లేదని తెలంగాణ హైకోర్టుకు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఆయనకు జర్మనీ పౌరసత్వం ఉందని చెప్పింది. 

Chennamaneni Ramesh Babu is ineligible for the post of MLA.. Central Government has told the High Court
Author
First Published Sep 15, 2022, 11:00 AM IST

వేముల‌వాడ ఎమ్మెల్యే చెన్న‌మ‌నేని ర‌మేష్ కు హైకోర్టులో గ‌ట్టి ఎదురుదెబ్బ త‌గ‌లింది. ఆయ‌న జ‌ర్మ‌నీ పౌరుడే అని కేంద్ర ప్రభుత్వం న్యాయస్థానానికి తేల్చి చెప్పింది. ర‌మేష్ శాస‌న‌స‌భ్యుడిగా కొన‌సాగ‌డానికి అన‌ర్హుడు అని చెప్పింది. బుధ‌వారం తెలంగాణ హైకోర్టులో ర‌మేష్ పౌర‌స‌త్వం వివాదంపై విచార‌ణ కొన‌సాగింది.
ఇంట్లోకి వచ్చిన పెద్ద కోతి.. షాక్ తో గుండెపోటుతో వ్యక్తి మృతి

కేంద్ర ప్ర‌భుత్వం త‌రుఫున అడిష‌న‌ల్ సొలిసిట‌ర్ జ‌న‌ర‌ల్ టి. సూర్య‌క‌ర‌ణ్ రెడ్డి హైకోర్టుకు హాజ‌రై వాద‌న‌లు వినిపించారు. వేములవాడ ఎమ్మెల్యేకు ద్వంద పౌర‌స‌త్వాలు ఉన్నాయ‌ని చెప్పారు. ఆయ‌న ఓసీఐ కార్డును క‌లిగి ఉన్నార‌ని, అలాంటి వ్య‌క్తులు శాస‌న స‌భ‌కు పోటీ చేసేందుకు అర్హ‌త లేద‌ని తెలిపారు. రమేష్ బాబు 2009 సంవ‌త్స‌రం నుంచి పౌర‌స‌త్వ వివాదంలో ఉన్నార‌ని చెప్పారు. కానీ ఇప్ప‌టికీ ఆయ‌న ఆ దేశ పౌర‌స‌త్వాన్ని విడిచిపెట్ట‌లేద‌ని పేర్కొన్నారు.

హైదరాబాదులో దారుణం : లాడ్జీలో బాలికపై రెండు రోజులపాటు గ్యాంగ్ రేప్..

2019లోనే సెంట‌ర్ హోం మినిస్ట్రీ చెన్న‌మ‌నేని పౌరస‌త్వాన్ని ర‌ద్దు చేస్తూ నిర్ణ‌యం తీసుకుంద‌ని చెప్పారు. అయితే అందులో కొన్ని టెక్నిక‌ల్ అంశాలు ప‌ట్టించుకోకూడద‌ని పేర్కొన్నారు. ఈ పౌర‌స‌త్వం అంశం చాలా ప్ర‌ధాన‌మైంద‌ని అన్నారు. ఆయ‌న పౌర‌స‌త్వం ర‌ద్దు చేయ‌డం చ‌ట్ట‌ప‌రంగా స‌రైందేన‌ని పేర్కొన్నారు.

కాగా.. ర‌మేష్ బాబు త‌ర‌ఫున న్యాయ‌వాది వాద‌న‌లు వినిపిస్తూ.. వేములవాడ ఎమ్మెల్యే ఇండియ‌న్ సిటిజ‌న్ అని తెలిపారు. ఆయ‌న‌కు జర్మ‌నీ దేశ పాస్ పోర్టు ఉంద‌ని, అంత మాత్ర‌నా ఆ దేశానికి చెందిన పౌరుడు ఎలా అవుతారని ప్ర‌శ్నించారు. ర‌మేష్ బాబును రాజ‌కీయంగా టార్గెట్ చేసేందుకే ఆయ‌న‌ను పౌర‌స‌త్వ వివాదంలో ఇరికించే ప్ర‌య‌త్నం చేస్తున్నార‌ని అన్నారు. దీనిని రాజ‌కీయ కోణంలో చూడాల్సిన అవ‌స‌రం ఉంద‌ని చెప్పారు.

టీఆర్ఎస్ నేత అరెస్ట్.. తల్వార్లు, డమ్మీ తుపాకీతో బెదిరించి భూములు లాక్కున్న కేసులో..

సాధార‌ణంగా శాస‌న‌స‌భ్యుడిగా ఎన్నికైన నెల రోజుల త‌రువాత ఫిర్యాదుల‌ను కేంద్రం స్వీక‌రించ‌కూడ‌ద‌ని అన్నారు. కానీ చాలా రోజుల త‌రువాత పౌర‌స‌త్వ వివాదంపై చేసిన ఫిర్యాదును కేంద్రం అందుకుంద‌ని తెలిపారు. ఇది చ‌ట్ట‌ప్ర‌కారం విరుద్దం అని చెప్పారు. వేముల‌వాడ శాస‌న‌స‌భ్యుడికి ఇండియ‌న్ సిటిజ‌న్ షిప్ ఉండ‌టం వ‌ల్ల ఎలాంటి న‌ష్ట‌మూ లేద‌ని తెలంగాణ ప్ర‌భుత్వం త‌ర‌ఫున హాజ‌రైన లాయర్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్ర‌భుత్వానికి చెప్ప‌కుండా ర‌మేష్ బాబు పౌర‌స‌త్వాన్ని ర‌ద్దు కేంద్ర ర‌ద్దు చేసింద‌ని ఆయ‌న ఆరోపించారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios