చీమలపాడు లో పేలుడు: క్లూస్ టీమ్ ఆధారాల సేకరణ

ఖమ్మం  జిల్లాలోని  కారేపల్లి  మండలం  చీమలపాడులో  గ్యాస్ సిలిండర్  పేలుడు  ఘటనపై  క్లూస్ టీమ్ ఆధారాలను  సేకరిస్తుంది.   నిన్న  గ్యాస్ సిలిండర్ పేలుడుతో  ముగ్గురు మృతి చెందారు. 

Cheemalapadu   Clues  Team  Searching For  Evidences  lns

ఖమ్మం: జిల్లాలోని  కారేపల్లి  మండలం  చీమలపాడులో  గ్యాస్ సిలిండర్  పేలుడు  ఘటనపై  క్లూస్ టీమ్  ఆధారాలు సేకరిస్తుంది.  వైరా  అసెంబ్లీ నియోజకవర్గ బీఆర్ఎస్ ఆత్మీయ  సమ్మేళనం  సందర్భంగా  బాణసంచా పేల్చడంతో  నిప్పురవ్వులు  పక్కనే  ఉన్న గుడిసెపై పడ్డాయి. ఈ గుడిసెలో  మంటలకు  గ్యాస్ సిలిండర్ పేలింది. ఈ ఘటనలో  ముగ్గురు మృతి చెందారు.  10 మంది  గాయపడ్డారు.  గాయపడిన వారిలో   ఏడుగురిని  హైద్రాబాద్ నిమ్స్ కు  తరలించారు.  

 చీమలపాడులో  గ్యాస్ సిలిండర్  పేలుడకు  గల కారణాలపై  క్లూస్ టీమ్  ఆరా తీస్తుంది.  గ్యాస్ సిలిండర్  పేలుడుకు  దారి తీసిన  పరిస్థితులపై  క్లూస్ టీమ్ ఆధారాలను సేకరిస్తుంది.  ఐదు నమిషాల ముందు  గ్యాస్ సిలిండర్ పేలుడు  జరిగి ఉంటే  ఇంకా ఎక్కువ మంది  గాయపడి ఉండేవారనే అభిప్రాయాలను  స్థానికులు  వ్యక్తం  చేస్తున్నారు.  గ్యాస్ సిలిండర్  పేలుడు తీవ్రత కారణంగా   పలువురు తీవ్రంగా గాయపడ్డారు.  శరీర భాగాలు  చిధ్రంగా మారాయి.  కాళ్లు, చేతులు  కూడా  తెగిపడిపోయాయి.  సంఘటన స్థలంలో  రక్తం,  మాంసం  ముద్దలు  ఎగిరిపడ్డాయి.  ఒకరి శరీర భాగాలు   ఓ చెట్టుపై  పడ్డాయి. 

గ్యాస్ సిలిండర్  పేలుడు  తీవ్రత  ఇంత  ఎక్కువగా  ఎందుకు  ఉందనే  విషయమై  క్లస్ టీమ్  ఆధారాలను  సేకరిస్తుంది.  గ్యాస్ సిలిండర్  పేలుడుకు  ఏమైనా  పేలుడు  పదార్ధాలు  దోహదపడ్డాయా అనే కోణంలో  కూడా  క్లూస్ టీమ్  అధికారులు పరిశీలన చేస్తున్నారు.  ప్రమాదం జరిగిన తీరు తెన్నుల గురించి  స్థానికులను  క్లూస్ టీమ్  వివరాలు సేకరిస్తుంది.

also read:కారేపల్లి మృతులకు రూ. 50 లక్షలివ్వాలి: ఖమ్మంలో కాంగ్రెస్ సహా పలు పార్టీల ఆందోళన

చీమలపాడు ఘటనపై   బీఆర్ఎస్ నాయకత్వం  తీవ్ర దిగ్భ్రాంతిని  వ్యక్తం  చేసింది.  మృతుల కుటుంబాలకు  రూ. 10 లక్షల ఎక్స్ గ్రేషియాను  ప్రకటించింది  ప్రభుత్వం.  ప్రమాదం జరిగిన తీరు  తెన్నులను సీఎం ేకసీఆర్  తెలుసుకున్నారు.  మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఎంపీ నామా నాగేశ్వరరావులకు    ఫోన్  చేశారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios