చెల్లెలు వరసయ్యే వివాహితతో అక్రమసంబంధం పెట్టుకున్నాడో చర్చి ఫాస్టర్. అతను టీఆర్ఎస్ నేత కూడా. ఈ విషయం ఆమె భర్తకు తెలియడంతో నిలదీయగా అతడిని కిడ్నాప్ చేసి బంధించాడు.
సంగారెడ్డి : భార్యపై అనుమానంతో భర్త బెడ్ రూమ్ లో సెల్ ఫోన్ కెమెరా ఏర్పాటు చేశాడు. మరో వ్యక్తితో భార్య చనువుగా ఉన్న దృశ్యం వీడియోలో రికార్డు అయింది.దీనిపై నిలదీసినందుకు అతడిని కిడ్నాప్ చేశారు. దీనికి సంబంధించి కిడ్నాప్, వివాహేతర సంబంధం కేసులో పోలీసులు ఏడుగురిపై కేసు నమోదు చేసి.. అందులో నలుగురిని రిమాండ్కు తరలించిన సంఘటన సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. బుధవారం సాయంత్రం పటాన్చెరు పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో.. అమీన్పూర్ సిఐ శ్రీనివాసులు రెడ్డితో కలిసి డి.ఎస్.పి భీమ్ రెడ్డి ఆ వివరాలు వెల్లడించారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందుకు చెందిన రాయని రాజు, భార్యతో కలిసి బతుకుదెరువుకోసం ఏళ్లక్రితం బీరంగూడ న్యూ సాయి భగవాన్ కాలనీకి వచ్చాడు. ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. రాజుకు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు.వారు ఏపీలోని మంగళగిరిలో అమ్మమ్మ వద్ద ఉంటూ చదువుకుంటున్నారు. కాగా, రాజు బావ దేవ శిఖామణి బీరంగూడ మంజీరా నగర్ కాలనీలో ఓలియో చర్చి పాస్టర్. ఇతడి భార్య అమీన్పూర్ మున్సిపల్ కోఆప్షన్ మెంబర్. ఈ క్రమంలో రాజు భార్య పద్మజ ప్రవర్తనలో మార్పు గమనించి, అనుమానంతో ఈ నెల 5వ తేదీన తన బెడ్ రూమ్ లో సెల్ ఫోన్ లో వీడియో ఆన్ చేసి సెల్ఫ్ లో పెట్టాడు.
కేంద్ర మంత్రులు వచ్చుడు, పోవుడు తప్ప తెలంగాణకు చేసిందేమీ లేదు.. హరీష్ రావు
అదే రోజు దేవ శిఖామణి ఇంటికి వచ్చి పద్మజతో చనువుగా ఉన్న వీడియో రికార్డ్ అయ్యింది. ఈ విషయంపై రాజు తన భార్యను నిలదీయగా ఆమె మంగళగిరిలోని తల్లిగారి ఇంటికి వెళ్ళింది. ఈ విషయంపై రాజు దేవ శిఖామణిని నిలదీశాడు. ఈ క్రమంలో 13వ తేదీన రాజు ఇంట్లో ఒంటరిగా ఉన్నాడు. అదే సమయంలో దేవ శిఖామణి అతడి స్నేహితులు కిరణ్ గౌడ్, కుంటోల్ల మల్లేష్, సాయి, దినేష్, పర్మప్ప అతడిని బలవంతంగా కారులో ఎక్కించుకుని ఇసుక బావి వద్ద ఖాళీ వెంచర్ లోకి తీసుకువెళ్ళారు.
అక్కడి నుంచి రామచంద్రపురంలోని అస్లంఖాన్ కు చెందిన శ్రీ సాయి ఫోటో స్టూడియోలో నిర్భందించారు. కట్టెలతో కొట్టి రాజు తీసిన వీడియోలను తొలగించారు. రాత్రంతా రాజును ఫోటో స్టూడియోలో ఉంచారు. 14వ తేదీన ఉదయం రాజు అక్కడినుంచి తప్పించుకుని తన స్వగ్రామానికి వెళ్ళాడు. 26వ తేదీన సాయంత్రం అమీన్పూర్ పోలీస్ స్టేషన్ లో జరిగిన విషయం చెప్పి ఫిర్యాదు చేశాడు.
ఈ మేరకు ఎస్సై సుభాష్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. రాజును కిడ్నాప్ చేసిన దేవ శిఖామణి, బేగంపేట కిరణ్ గౌడ్, మల్లేష్ గౌడ్, అస్లాం ఖాన్ లను అదుపులోకి తీసుకున్నారు. సాయి, దినేష్, పర్మప్ప పరారీలో ఉన్నారు. పోలీసులు కారు, నాలుగు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. నలుగురిని 120(బి), 386, 448, 363, 324, 442, 506 కింద కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు.
పార్టీ నుంచి సస్పెన్షన్
వివాహేతర సంబంధం కేసులో పోలీసులు అరెస్టు చేసిన టిఆర్ఎస్ నేత, అమీన్పూర్ కో-ఆప్షన్ సభ్యులు భర్త దేవశిఖామణిని టిఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ఆ పార్టీ మండల అధ్యక్షుడు చౌటకూరి బాల్ రెడ్డి తెలిపారు. బుధవారం మధ్యాహ్నం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. టీడీఎస్ మణి ఓ పాస్టర్ గా గుర్తింపు పొందారని, దాంతోనే ఆయనకు టిఆర్ఎస్ లో పనిచేసే అవకాశం కలిగిందని అన్నారు.
సభ్య సమాజానికి మచ్చ తెచ్చేలా వ్యవహరించారు అని ఆరోపణలు రావడంతో పార్టీ నుంచి తక్షణం సస్పెండ్ చేస్తున్నట్లు తెలిపారు. ఆయన భార్య కూడా పదవి నుంచి తొలగించాలని తాము కోరుకుంటున్నామన్నారు. పార్టీకి చెడ్డపేరు తెచ్చే విధంగా ప్రవర్తిస్తే ప్రోత్సహించేది లేదన్నారు.
