Asianet News TeluguAsianet News Telugu

జోనల్ వ్యవస్థలో మార్పులు: తెలంగాణ సిఫారసులకు .. కేంద్రం ఆమోదం

తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు, స్థానికతకు సంబంధించి జోనల్‌ వ్యవస్థలో మార్పులు, చేర్పులకు కేంద్ర ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. కొత్త జిల్లాల ఏర్పాటు నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించిన మార్పులు, చేర్పులకు కేంద్ర హోంశాఖ ఆమోదం తెలిపింది

changes in telangana zones ksp
Author
Hyderabad, First Published Jun 30, 2021, 8:12 PM IST

తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు, స్థానికతకు సంబంధించి జోనల్‌ వ్యవస్థలో మార్పులు, చేర్పులకు కేంద్ర ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. కొత్త జిల్లాల ఏర్పాటు నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించిన మార్పులు, చేర్పులకు కేంద్ర హోంశాఖ ఆమోదం తెలిపింది. ఈ మేరకు నారాయణపేట జిల్లాకు జోగులాంబ జోన్‌లో, ములుగు జిల్లాకు కాళేశ్వరం జోన్‌లో చోటు కల్పించారు. స్థానికంగా ఉన్న విజ్ఞప్తుల మేరకు వికారాబాద్‌ జిల్లాను జోగులాంబ జోన్‌ నుంచి చార్మినార్‌ జోన్‌కు మార్పు చేశారు. ఇక నుంచి అందుకు అనుగుణంగానే ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు చేపట్టడంతో పాటు స్థానికతను ఖరారు చేస్తారు. కేంద్రం ఆదేశాల నేపథ్యంలో తెలంగాణ సీఎస్ సోమేశ్‌ కుమార్‌ ఉత్తర్వులు జారీ చేయనున్నారు.  

ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో  ఆరు జోన్లు ఉండేవి. అయితే రాష్ట్రం విడిపోయినందున  తెలంగాణ రాష్ట్ర అవసరాల మేరకు జోన్లను విభజించారు. ఉమ్డి ఏపీరాష్ట్రంలో జిల్లా, జోనల్, రాష్ట్ర స్థాయి పోస్టుల్లో రిక్రూట్ మెంట్ జరిగేది. హైద్రాబాద్ రాష్ట్రం, ఏపీ విలీనమైన సందర్భంలో  రాష్ట్రపతి ఉత్తర్వుల మేరకు ఈ జోన్ల వ్యవస్థ అమల్లోకి వచ్చింది.రాష్ట్రాల విభజన పూర్తైన తర్వాత తెలంగాణ రాష్ట్ర అవసరాల మేరకు జోన్ల వ్యవస్థను మార్చుకొంది తెలంగాణ సర్కార్.

Also Read:జోనల్ వ్యవస్థ అంటే ఏమిటీ?: మోడీ చేతికి చిక్కిన కేసీఆర్

ఉమ్మడి ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో 371 డి ఆర్టికల్ ఉంది.రాష్ట్రాలు విడిపోయినా తర్వాత కూడ ఈ ఆర్టికల్ రెండు రాష్ట్రాలకు వర్తిస్తోంది.రెండు రాష్ట్రాల్లో జోనల్ వ్యవస్థలున్నాయి.ఉమ్మడి రాష్ట్రంలో ఆరు జోన్లు ఉండేవి. తెలంగాణ రాష్ట్రానికి 5, 6 జోన్ లున్నాయి..ఒకటి నుండి నాలుగు జోన్లు సీమాంద్ర జిల్లాల్లో ఉండేవి.ఐదు,ఆరు జోన్లు తెలంగాణ జిల్లాల్లో ఉండేవి.అన్ని ప్రాంతాలవారికి సమాన అవకాశాలు ఇవ్వాలనే లక్ష్యంతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో  1975లో రాష్ట్రపతి ఉత్తర్వులు అమల్లోకి వచ్చాయి.

Follow Us:
Download App:
  • android
  • ios