రాజధాని రచ్చ: రైతులకు మద్దతుగా చంద్రబాబు దంపతుల దీక్ష
రైతులకు మద్దతుగా చంద్రబాబు దంపతులు బుధవారం నాడు తమ మద్దతు ప్రకటించారు.
గుంటూరు: అమరావతిలోనే రాజధానిని కొనసాగించాలని డిమాండ్ చేస్తున్న రైతులకు టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు దంపతులు బుధవారంనాడు తమ సంఘీభావం ప్రకటించారు.
ఏపీకి మూడు రాజధానులు వచ్చే అవకాశం ఉందని అసెంబ్లీ వేదికగా ఏపీ సీఎం వైఎస్ జగన్ ప్రకటించారు. దీంతో 15 రోజులుగా అమరావతి పరిసర గ్రామాలకు చెందిన రైతులు ఆందోళనలు కొనసాగిస్తున్నారు. ఈ రైతులకు చంద్రబాబునాయుడు ఇప్పటికే తన సంఘీభావాన్ని ప్రకటించారు.
మరో వైపు ఇవాళ కొత్త సంవత్సర వేడుకలకు కూడ దూరంగా ఉండాలని చంద్రబాబునాయుడు పార్టీ నేతలకు సూచించారు. బుధవారం నాడు ఉదయం విజయవాడలోని కనకదుర్గ అమ్మవారిని తన సతీమణి భువనేశ్వరీతో కలిసి చంద్రబాబునాయుడు దర్శించుకొన్నారు. ఆ తర్వాత చంద్రబాబునాయుడు దంపతులు ఎర్రబాలెంలో రైతుల దీక్ష శిబిరంలో పాల్గొన్నారు.
Also read:చచ్చిపోతాం.. పర్మిషన్ ఇవ్వండి: రాష్ట్రపతికి అమరావతి రైతుల లేఖ
రైతులు తమ ఆవేదనను ఈ సందర్భంగా చంద్రబాబునాయుడు దంపతులకు విన్నించారు. రైతాంగానికి అండగా నిలుస్తామని ఈ సందర్భంగా భువనేశ్వరీ, చంద్రబాబునాయుడు ప్రకటించారు.
Also read:నేను పోలీసు కొడుకునే: పోలీసులపై పవన్ ఫైర్
రాజధాని పరిసర గ్రామాల్లోని మందడం, తుళ్లూరు గ్రామాల్లో నిరసన కార్యక్రమాల్లో కూడ చంద్రబాబునాయుడు దంపతులు ఇవాళ పాల్గొంటారు. రైతులకు అండగా మంగళవారం నాడు జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ పర్యటించారు.