పదేళ్లలో తెలంగాణ అభివృద్ధికి కేంద్రం అనేక నిధులిచ్చింది - ప్రధాని నరేంద్ర మోడీ
గడిచిన పదేళ్లలో తెలంగాణ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అనేక నిధులు అందించిందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. శంలో జరుగుతున్న అభివృద్ధికి ఆదిలాబాద్ కార్యక్రమాలు నిదర్శనమని తెలిపారు.
ప్రధాని నరేంద్ర మోడీ సోమవారం ఉదయం ఆదిలాబాద్ కు చేరుకున్నారు. ఆయనకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, గవర్నర్ తమిళ సై ఘన స్వాగతం పలికారు. అనంతరం జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో అధికారిక కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ పలు అభివృద్ధి కార్యక్రమాలను శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు.
అయ్యో పాపం.. బిందెలో తలపెట్టి ఇరుక్కుపోయిన చిరుత.. వీడియో వైరల్
అనంతరం ప్రధాని నరేంద్ర మోడీ ప్రసగించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు జరిగి పదేళ్లు అవుతుందని అన్నారు. అప్పటి నుంచి తెలంగాణ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అనేక నిధులు వెచ్చించిందని తెలిపారు. తెలంగాణ ప్రజల కలను సాకారం చేసేందుకు కేంద్రం సహకరిస్తోందని తెలిపారు.
దేశ ఆర్థిక వ్యవస్థ బలపడితే రాష్ట్రాలకు లాభం కలుగుతుందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. దేశంలో జరుగుతున్న అభివృద్ధికి ఆదిలాబాద్ కార్యక్రమాలు నిదర్శనమని అన్నారు. నేడు తెలంగాణలో 1800 మెగావాట్ల కరెంటు ఉత్పత్తి చేసే ఎన్టీపీసీని జాతికి అంకితం చేశానని తెలిపారు. వచ్చే ఐదేళ్లలో భారత్ అభివృద్ధి పరంగా మరింత ముందుకెళ్తుందని ధీమా వ్యక్తం చేశారు.
తొలిసారి ఒకే వేదికపై ప్రధాని మోడీ, సీఎం రేవంత్ రెడ్డి..
కాగా.. ప్రధాని నరేంద్ర మోడీ ఇందిరా ప్రియదర్శిని స్టేడియం నుంచి వర్చువల్ గా ఎన్టీపీసీ రెండో యూనిట్ ను ప్రారంభించారు. అలాగే అదిలాబాద్ -బేలా, ములుగులో రెండు జాతీయ రహదారులకు శంకుస్థాపన చేశారు. దీంతో పాటు ఆదిలాబాద్ - పిప్పల్ కోటి - అంబోలా రైల్వే విద్యుద్ధీకరణ మార్గాన్ని ప్రారంభించారు.