వలసకూలీల గుడ్ న్యూస్... కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఉత్తర్వులతో కీలక చర్యలు

లాక్ డౌన్ కారణంగా తెలంగాణ లో చిక్కుకున్న  వలస కూలీలు తమ  తమ సొంత రాష్ట్రాలకు తరలివెెళ్లడానికి తెలంగాణ ప్రభుత్వం షరతులతో  కూడిన అనుమతులిచ్చింది. 

Central permission for the evacuation of migrant laborers

లాక్ డౌన్ కారణంగా నిలిచిపోయిన వారిని తరలించెందుకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఉత్తర్వులను జారిచేసిందని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి  సోమేశ్ కుమార్  తెలిపారు. తెలంగాణ  సీఎస్ బుధవారం బి.ఆర్.కె.ఆర్ భవన్ లో ఈ అంశం పై ఉన్నాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ అంశాన్ని పరీశిలించేందుకు సందీప్ కుమార్ సుల్తానియా ను నోడల్ అధారిటీ గా నియమించింది. నోడల్ అధారిటీకి అధికారుల బృందం సహయ సహకారాలు అందిస్తుంది.

రాష్ట్రంలో నిలిచి పోయిన వ్యక్తులను తరలించడానికి ప్రోటోకాల్ ను రూపొందించడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో నిలిచిపోయిన వారి రాష్ట్రాలకు సంబంధించిన వ్యక్తుల వివరాలను తెలుపవలసిందిగా కోరుతు అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు లేఖను రాసినట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తెలిపారు. తెలంగాణ లో నిలిచిపోయిన వారిని, వారి రాష్ట్రాలకు తరలించడానికి అవసరమైన రవాణ సౌకర్యాన్ని ఏర్పాటు చేసుకోవాలని కూడా కోరినట్లు ప్రధాన కార్యదర్శి వివరించారు. 

అవసరమైన ఏర్పాట్ల కోసం తమ రాష్ట్రాలకు సంబంధించిన నోడల్ అధారిటీలను తెలంగాణ నోడల్ అధారిటీలతో సంప్రదించాలని సి.యస్ కోరారు. తెలంగాణలో నిలిచిపోయిన వారికి అవసరమైన స్క్రీనింగ్ ను నిర్వహించి వైరస్ లక్షణాలు లేని వారికి ప్రయాణం కోసం పాసులను తెలంగాణ నోడల్ అధారిటీ జారీ చేస్తుంది. 

తెలంగాణ నిలిచిపోయి తమ స్వరాష్ట్రాలకు వెల్లాలనుకున్న వారు తమ రవాణ సోకర్యం కోసం ఆయ రాష్ట్రాలను సంప్రదించవలసివుటుంది. తెలంగాణ రాష్ట్రంలో నిలిచిపోయి తమ రాష్ట్రాలకు వెల్లాలనుకున్న వారికి ప్రభుత్వం అనుమతి ఇస్తుంది. 

ఈ సమావేశంలో ముఖ్యకార్యదర్శులు వికాస్ రాజ్, సునీల్ శర్మ, పోలీస్ శాఖ అదనపు డి.జి. (L&O) జితేందర్ , కార్యదర్శిలు సందీప్ కుమార్ సుల్తానియా, రాహుల్ బొజ్జ, రోనాల్డ్ రోజ్, డైరెక్టర్ సి.సి.ఎల్.ఎ రజత్ కుమార్ సైనీ పాల్గొన్నారు.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios