తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ ఇటీవల ఆదిలాబాద్ సభలో ప్రధాని నరేంద్ర మోడీపై తీవ్రమైన భాషలో విరుచుకుపడ్డారు. మోడి గాడు అంటూ ఏకవచనంతో తిట్ల వర్షం కురిపించారు కేసిఆర్. తాను బాధతోనే మోడీపై తీవ్రమైన కామెంట్లు చేస్తున్నానని కూడా చెప్పుకున్నారు.

ఇక కేసిఆర్ వాడిన భాష కమలనాథులను కలవరపాటుకు గురిచేసింది. ఏకంగా దేశ ప్రధానిని పట్టుకుని తిట్లు తిట్టడం ఏంటని బిజెపి నేతలు అగ్గి మీద గుగ్గిలమవుతున్నారు. ఈ విషయంలో కేంద్ర, రాష్ట్ర సంబంధాలపై కూడా ప్రభావం చూపే ప్రమాదం వచ్చి పడింది. తెలంగాణలో పర్యటించాలనుకుంటున్న మంత్రులంతా కేసిఆర్ ప్రధానిపై వాడిన భాష తర్వాత వెనుకంజ వేసే పరిస్థితి వచ్చిందని చెబుతున్నారు.

తాజాగా హైదరాబాద్ లో ఒక కార్యక్రమంలో పాల్గొనేందుకు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ వెనుకాముందు అయ్యారు. అసలు కేసిఆర్ తిట్ల భాష తర్వాత హైదరాబాద్ కార్యక్రమానికి రావాలా వద్దా అన్న సంశయంలో పడిపోయారట. అయితే ఆ కార్యక్రమంలో తనతోపాటు సిఎం కేసిఆర్ తనయుడు ఐటి మంత్రి కేటిఆర్ కూడా హాజరయ్యారు. అయితే ముందుగానే.. ఆమె కేటిఆర్ కు కాల్ చేసి ప్రధాన మంత్రి గురించి మీ తండ్రి వాడిన భాష, ఏకవచనంతో తిట్టిన నేపథ్యంలో హైదరాబాద్ లో కార్యక్రమానికి రావడం తనకు ఇష్టంలేదని చెప్పారట.

దానికి మంత్రి కేటిఆర్ స్పందిస్తూ.. మా డాడీ మాటలు పట్టించుకోవద్దని బతిలాడినట్లు ఆమె వెల్లడించారు. అంతేకాదు కేసిఆర్ నోరు జారే మనిషి అని చెప్పిండట. తన తండ్రి మాటలను పట్టించుకోవద్దని రిక్వెస్టు చేసిండట. ఇక కేటిఆర్ తన తండ్రి గురించి అలా చెప్పిన తర్వాత నిర్మలా సీతారామన్ కార్యక్రమంలో కేటిఆర్ తో కలిసి పాల్గొన్నారట. తర్వాత కార్యక్రమంలో కూడా కేటిఆర్ ను తన తండ్రి భాష గురించి మళ్లీ లేవనెత్తినట్లు చెప్పారు.

మొత్తానికి తండ్రి కేసిఆర్ నోరు జారితే.. కొడుకు కేటిఆర్ కవరింగ్ చేస్తున్నారని బిజెపి నేతలు సెటైర్ వేస్తున్నారు. నిర్మలా సీతారామన్ ఏం మాట్లాడారో కింద వీడియోలో చూడండి. (ఈ వీడియో  బిజెపి అధికారిక పేజీ నుంచి తీసుకున్నాము.)