Asianet News TeluguAsianet News Telugu

సెల్ ఫోన్, రాంగ్ రూట్...ఇతడి ప్రాణాలను ఎలా బలితీసుకున్నాయో చూడండి.( వీడియో)

హైదరాబాద్  ట్రాఫిక్ పోలీసులు నిబంధనలు పాటించమని ఎంత అవగాహన కల్పించినా వాహనదారులు నిర్లక్ష్యాన్ని వీడటం లేదు. సెల్ ఫోన్ లో మాట్లాడుతూ డ్రైవింగ్ చేయవద్దని, రాంగ్ రూట్ లో ప్రయాణించవద్దని,  హెల్మెట్ ధరించాలని పోలీసులు ప్రసార మాధ్యమాల ద్వారా ప్రచారం చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ మూడు నిబంధనలు పాటించకకుండా బైక్ నడిపిన ఓ వ్యక్తి ప్రమాదానికి గురై అతి దారుణంగా మృతి చెందాడు. ఈ దుర్ఘటన హైదరాబాద్ పాతబస్తీలో  చోటుచేసుకుంది.

Cell Phone driving leads to accident in Bahadurpura

హైదరాబాద్  ట్రాఫిక్ పోలీసులు నిబంధనలు పాటించమని ఎంత అవగాహన కల్పించినా వాహనదారులు నిర్లక్ష్యాన్ని వీడటం లేదు. సెల్ ఫోన్ లో మాట్లాడుతూ డ్రైవింగ్ చేయవద్దని, రాంగ్ రూట్ లో ప్రయాణించవద్దని,  హెల్మెట్ ధరించాలని పోలీసులు ప్రసార మాధ్యమాల ద్వారా ప్రచారం చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ మూడు నిబంధనలు పాటించకకుండా బైక్ నడిపిన ఓ వ్యక్తి ప్రమాదానికి గురై అతి దారుణంగా మృతి చెందాడు. ఈ దుర్ఘటన హైదరాబాద్ పాతబస్తీలో  చోటుచేసుకుంది.

పాతబస్తీలో నివాసముండే  ఖాజా మోహినుద్దీన్(35)  బహదూర్ పురా నాలా వద్ద ప్రమాదానికి గురయ్యాడు.  సెల్ ఫోన్ మాట్లాడుతూ బైక్ నడపటంతో పాటు రాంగ్ రూట్ వెళుతుండగా ఇతడి బైక్ ని వేగంగా వచ్చిన మరో బైక్ ఢీకొట్టింది. ప్రమాదం జరిగినపుడు హెల్మెట్ కూడా ధరించకపోవడంతో తల బలంగా నేలకు తాకి మోహినుద్దిన్  తీవ్ర గాయాలపాలయ్యాడు.  అతడిని స్థానికులు చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అయితే సదరు వ్యక్తి అప్పటికే బ్రెయిన్ డెడ్ అయినట్లు వైద్యులు నిర్ధారించారు. 

ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలం వద్ద గల సిసి కెమెరాలను పరిశీలించారు. ఇందులో ప్రమాదం జరిగిన తీరు స్పష్టంగా రికార్డయ్యింది. దీంతో కేసు నమోదు చేసిన  బహదూర్ పుర పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.  

"
  
Follow Us:
Download App:
  • android
  • ios