Asianet News TeluguAsianet News Telugu

ధనిక రాష్ట్రమైన తెలంగాణ కేవలం దానివల్లే పేదరాష్ట్రంగా మారిందా?: బండి సంజయ్

యావత్ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ ఏఐఎంఐఎంతో కలిసి ముస్లిం మైనారిటీ ఓట్లకోసం తాపత్రయ పడుతున్నారని తెలంగాణ బిజెపి బండి సంజయ్ ఆరోపించారు. .
 

Celebrate Liberation Day on September 17: Telangana BJP Chief Bandi Sanjay demand
Author
Karimnagar, First Published Sep 9, 2020, 11:04 AM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ సోయి లేకుండా, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ కేవలం కొందరికోసం మాత్రమే సెప్టెంబర్17న విమోచన దినంగా ప్రకటించడం లేదని తెలంగాణ బిజెపి అధ్యక్షులు బండి సంజయ్ మండిపడ్డారు. కేవలం డబ్బులు సంపాదించడం గురించే ముఖ్యమంత్రి ఆలోచిస్తున్నారని అన్నారు. ఇలా అడ్డగోలుగా డబ్బులు సంపాదించడం మళ్ళీ వాటిని ఎన్నికల్లో ఖర్చుపెట్టడం తప్ప ఆయనకు వేరే పనేమీ లేదని ఆరోపించారు. 

''ఆనాడు తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ ఒక మాట చెప్పాడు. 'నేను అబద్ధాలు చెప్తే నా తల నరికేసుకుంటా' అని. మరి ఇప్పుడు నీ తల ఉందా కేసీఆర్. తల లేని సిఎం మనకు అవసరమా?. ఆయన ఏఐఎంఐఎంతో కలిసి ముస్లిం మైనారిటీ ఓట్లకోసం తాపత్రయ పడుతున్నాడు. కేసీఆర్ కుట్రతో ఎందరో ఆత్మహత్యలు చేసుకున్నారు''  అని ఆవేదన వ్యక్తం చేశారు. 

''తెలంగాణ అమరవీరుల చరిత్రను పాఠ్య పుస్తకాలలో చేర్చాలి. కానీ కేసీఆర్ తన కుటుంబ చరిత్రను పుస్తకాలలో చేర్చడానికి ఆలోచిస్తున్నాడు. కేటీఆర్, కవిత లాంటి వాళ్ళు ఉద్యమంలో ఏనాడైన పని చేశారా?. ఉద్యమ సమయంలో హరిష్ రావు పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకుందామంటే పాపం అగ్గిపెట్టే మాయం అయింది'' అని ఎద్దేవా చేశారు. 

''రాష్ట్ర ప్రజల ధన, మాన, ప్రాణాలను దోచుకునేందుకు కేసీఆర్ ప్రయత్నం చేస్తున్నాడు. తెలంగాణ వచ్చిన తర్వాత ప్రజలకు ఒరగబెట్టింది ఏం లేదు. నోరు తెరిస్తే అబద్ధాలు చెప్పడమే కేసీఆర్ పని.  నిజాం నిరంకుశ  పాలనకి వ్యతిరేకంగా బీజేపీ పార్టీ పనిచేస్తుంది'' అని సంజయ్ స్పష్టం చేశారు. 

బ్రేకింగ్: తెలంగాణ అసెంబ్లీలో కరోనా కలకలం.. ఓ ఉద్యోగికి పాజిటివ్

''ఎల్ఆర్ఎస్ వల్ల పేద ప్రజలకు ఒరిగేదేమీ లేదు. ఈ ఎల్ఆర్ఎస్ వల్ల పేదవాడి ఉసురు పోసుకుని డబ్బులు గళ్లలో వేసుకుంటున్నాడు.  ధనిక రాష్ట్రంగా చేసుకోవడానికి ఎల్ఆర్ఎస్ వసులు చేస్తున్నాం అంటున్నాడు.  కరోన వచ్చిన వెంటనే ధనిక రాష్ట్రం కాస్త పేద రాష్ర్టం అయిందా?'' అని నిలదీశారు. 

''కోవిద్-19 వచ్చి 3నెలలు అయింది. రాష్ట్రంలో ఏం చేశారో ఆలోచించుకోవాలి. కోవిడ్ నియంత్రణ కోసం కేంద్ర ప్రభుత్వం 7వేల కోట్లు కేటాయించింది. కరోనా కారణంగా రోడ్డునపడ్డ ఏ ఒక్కరినీ టీఆర్ఎస్ ప్రభుత్వం అదుకోలేదు. స్కూళ్లు మూతపడటంతో ప్రయివేటు ఉపాధ్యాయులు ఏం చేయలేక కూలికి పోతున్నారు. ఇక కోవిడ్ పేరుతో ప్రయివేటు ఆసుపత్రులకు దోచి పెడుతున్నారు'' అని మండిపడ్డారు.

''సింగరేణి ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఏమయ్యాయి.  సింగరేణి కార్మికులకు వడ్డీ లేకుండా రుణం ఇస్తామన్నారు. కానీ ఎన్నికలయ్యాక దాన్ని మర్చిపోయారు.  రానున్న సింగరేణి ఎన్నికల్లో మళ్ళీ పిట్టలదొర రానున్నాడు, తన యాస, బాషతో మళ్ళీ ఎన్నికల్లో మోసపూరిత వాగ్ధానాలు చేస్తాడు. ఓటర్లను మల్లిస్తాడు.  సింగరేణి ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ ఇచ్చే పైసలు తీసుకోండి. ఆ పైసలు మనవే. కానీ ఓటు మాత్రం బిఎంఎస్ కు వేసి సంఘాని గెలిపించాలని కోరుకుంటున్నాను. సింగరేణి కార్మికులు ఇచ్చే తీర్పుకు కేసీఆర్ మైండ్ బ్లాక్ అవ్వాలి'' అని సంజయ్ సూచించారు. 

''స్వరాష్టం కోసమే సింగరేణి కార్మికులు ఎంతో పని చేశారు. కానీ వారికి ఒరిగిందేమిటి. మాజీ ప్రధాని  పీవీ నర్సింహారావును గతంలో తెలంగాణకి వ్యతిరేకి అని   అవమానించి ఇప్పుడు మళ్లీ తన అవసరం కోసం పివి మన టివి అంటున్నాడు.  ఇన్ని సంవత్సరాల నుండి నీకు గుర్తుకు రాణి పీవీ 100 సంవత్సరాల జన్మదినానికి గుర్తుకు వచ్చాడా? తన పేరుతో జేబులు నింపుకోవలనే ఆలోచన తప్ప ఇంకొకటి లేదు'' అని విరుచుకుపడ్డారు. 

''2023 లో రాష్రంలో అధికారంలోకి రానున్నది బీజేపీ మాత్రమే. గోల్కొండ కిల్లా మీద ఎగిరిది కాషాయపు జెండానే. బిజెపి అధికారంలోకి రాగానే సెప్టెంబర్17న తెలంగాణ విమోచన దినోత్సవంగా అధికారికంగా ప్రకటిస్తాం. నియామకాల పేరుతో లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారు. ఆర్ఎఫ్‌సిఎల్ లో జరుగుతున్న అక్రమాల పై కేంద్రం దృష్టికి తీసుకువెళ్లి కారకులుపై చర్యలు తీసుకునెల చూస్తాం.

 రాష్ట్ర ప్రభుత్వం ఆర్ఎఫ్‌సిఎల్ విషయంలో కేంద్రానికి 54కోట్లు చెల్లించాల్సి ఉంది. దీని పై స్పందన లేదు. కానీ కంపెనీ లో వాటాపై మాత్రం కుతూహళం ప్రదర్శిస్తున్నారు'' అని బండి సంజయ్ పేర్కొన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios