తెలుగు అకాడమీలో నిధుల గోల్‌మాల్: మాజీ డైరెక్టర్‌ సోమిరెడ్డికి సీసీఎస్ నోటీసులు

తెలుగు అకాడమీలో నిధుల గోల్ మాల్ వ్యవహరంపై మాజీ డైరెక్టర్ సోమిరెడ్డితో పాటు అకౌంట్స్ అధికారిని విచారణకు హాజరు కావాలని సీసీఎస్ పోలీసులు నోటీసులిచ్చారు. ఈ కేసులో ఇప్పటికే నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు.

CCS police issues notice to former Telugu Akademi director Somi Reddy

హైదరాబాద్: తెలుగు అకాడమీ (Telugu Akademi) మాజీ డైరెక్టర్ సోమిరెడ్డితో (somi reddy)పాటు అకౌంట్స్ అధికారిని విచారణకు హాజరు కావాలని సీసీఎస్  (ccs police)పోలీసులు  నోటీసులు (notice) జారీ చేశారు.

తెలుగు అకాడమీలో నిధుల గోల్‌మాల్ (fraud) వ్యవహరంపై సీసీఎస్ పోలీసులు ఇప్పటికే నలుగురిని (four arrest)అరెస్ట్ చేశారు. తెలుగు అకాడమీకి చెందిన బ్యాంకు డిపాజిట్లను బ్యాంకుల నుండి డ్రా చేశారు. పలు బ్యాంకుల్లో  ఉన్న సుమారు రూ. 70 కోట్ల నిధులను డ్రా చేశారు నిందితులు.

 ఈ విషయమై అందిన ఫిర్యాదుల ఆధారంగా విచారణ నిర్వహించిన  సీసీఎస్ పోలీసులు నలుగురిని అరెస్ట్ చేశారు. తెలుగు అకాడమీలో నిధులు గోల్ మాల్ వ్యవహరం వెలుగు చూడడంతో డైరెక్టర్ పదవి నుండి సోమిరెడ్డిని రాష్ట్ర ప్రభుత్వం తప్పించింది., రెండు రోజుల క్రితమే సోమిరెడ్డిని ఈ పదవి నుండి తప్పించింది.

సోమిరెడ్డితో పాటు అకౌంట్స్ విభాగం చూసే ప్రధాన అధికారిని కూడ విచారణకు రావాలని సీసీఎస్ పోలీసులు నోటీసులుఇచ్చారు.తెలుగు అకాడమీ ఉద్యోగులంతా కూడ అందుబాటులో ఉండాలని కూడ సీసీఎస్ పోలీసులు ఆదేశించారు.

మస్తాన్ వలీ(mastan vali), రాజ్ కుమార్ (raj kumar)తో ఉన్న సంబంధాలపై కూడ సీసీఎస్ పోలీసులు విచారణ చేయనున్నారు.వెలుగులోకి ఔట్ సోర్సింగ్ ఉద్యోగి రఫీ తో ఉన్న ఆర్ధిక లావాదేవీలపై కూడ సీసీఎస్ పోలీసులు ఆరా తీసే అవకాశం ఉంది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios