Asianet News TeluguAsianet News Telugu

దుండిగల్ మల్లంపేటలో అక్రమ నిర్మాణాలపై కేసు నమోదు.. లీగల్ ఒపీనియన్‌కు ల్యాండ్ డాక్యుమెంట్స్..

దుండిగల్‌ (Dundigal) మున్సిపాలిటీ మల్లంపేట (mallampet) రెవెన్యూ పరిధిలో అక్రమ విల్లాలపై పోలీసులు కేసు నమోదు చేశారు. అక్రమ విల్లాలపై మున్సిపల్ కమిషనర్ చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు చర్యలకు సిద్దమయ్యారు. 

case Filed Against Dundigal mallampet illegal constructions
Author
Hyderabad, First Published Dec 13, 2021, 1:34 PM IST

దుండిగల్‌ (Dundigal) మున్సిపాలిటీ మల్లంపేట (mallampet) రెవెన్యూ పరిధిలో అక్రమ విల్లాలపై పోలీసులు కేసు నమోదు చేశారు. అక్రమ విల్లాలపై మున్సిపల్ కమిషనర్ చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు చర్యలకు సిద్దమయ్యారు. శ్రీనివాస కన్‌స్ట్రక్షన్ యజమాని విజయలక్ష్మిపై.. చీటింగ్, ఫోర్జరీ, ట్రెస్‌పాస్ కింద కేసు నమోదు చేశారు. వారం రోజుల్లుగా విచారణకు హాజరు కావాలని విజయలక్ష్మిని పోలీసులు ఆదేశించారు. ఇందుకు సంబంధించి ల్యాండ్ డాక్యుమెంట్లను లీగల్ ఒపీనియన్‌కు పంపినట్టుగా దుండిగల్ సీఐ తెలిపారు. 

మల్లంపేట రెవెన్యూ పరిధిలో భారీగా అక్రమ కట్టడాలు వెలుగుచూసిన సంగతి తెలిసిందే. సరైన అనుమతులు లేకుండా ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్లలో బిల్డింగ్స్ నిర్మిస్తున్నారు. అధికారులకు భారీగా డబ్బు ఆశ చూపి ఈ అక్రమ నిర్మాణాలు చేపట్టిన వార్తలు వస్తున్నాయి. మల్లంపేటలో అక్రమ కట్టడాలు వెలుగుచూడంతో వాం రోజుల కిందట.. మునిసిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌, అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అధికారులు 100 విల్లాలకు సీలు వేశారు. మరో నాలుగు విల్లాలను కూల్చివేశారు. మల్లంపేటలో 260 అక్రమ విల్లాలు ఉన్నట్టుగా రెవెన్యూ రికార్డులు చెబుతున్నాయి. హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (HMDA),  కమిషనర్ & డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ (CDMA) నుండి తప్పనిసరి అనుమతి లేకుండా ఈ విల్లాలు నిర్మించబడ్డాయి. కేవలం గ్రామ పంచాయతీ కార్యదర్శుల అనుమతితోనే నిర్మాణాలు చేపట్టారని.. నిర్మాణాలు చేపట్టడానికి ఆ అనుమతులు సరిపోవని అధికారులు చెబుతున్నారు. 

కత్వ చెరువులోని ఫుల్ ట్యాంక్ లెవల్ (FTL)/ బఫర్ జోన్‌లో ఎనిమిది విల్లాలు నిర్మించినట్టుగా అధికారులు గుర్తించారు. అదే ప్రాంతంలో హెచ్‌ఎండీఏ ఆమోదం పొందిన 66 విల్లాలు ఉన్నాయని, వాటికి ఎటువంటి ఇబ్బంది లేదని చెప్పారు. అక్రమ నిర్మాణాలు, అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకోవాలని, నిబంధనలకు అనుగుణంగా నివేదిక ఇవ్వాలని కోరుతూ.. మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లా కలెక్టర్ దుండిగల్ మునిసిపాలిటీ మున్సిపల్ కమిషనర్‌కు లేఖ రాసిన నేపథ్యంలో సీలింగ్ మరియు కూల్చివేత డ్రైవ్ చేపట్టారు.

Follow Us:
Download App:
  • android
  • ios