Asianet News TeluguAsianet News Telugu

ఐపీఎస్ ప్ర‌వీణ్ కుమార్ పై లోకాయుక్త‌లో పిర్యాదు

లోకాయుక్తాలో ప్రవీణ్ కుమార్ పై పిర్యాదు

తన అధికారలను దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపణ.

తన బావమర్ధి కేశవ్ కు టెండర్ లేకుండా పనులు అప్పగించారని  ఆరోపణ

తక్షణ  చర్యలు తీసుకోవాలన్న మానవతా రాయ్

case file in loka yuktha againast IPS praveen kumar

 గురుకులాల కార్యదర్శి  R.S ప్రవీణ్ కుమార్ పై లోకాయుక్తలో పిర్యాదు న‌మోదైయింది. నిరుద్యోగ జెఏసి ఛైర్మన్ కోటూరి మానవతా  ఐపీఎస్ ప్ర‌వీణ్ కుమార్ పై పిర్యాదు చేశాడు. ప్రవీణ్ తన పదవిని అడ్డుపెట్టుకుని వ్యతిరేకంగా అనేక అక్రమాలకు పాల్పడుతున్నాడని రాయ్ మంగళవారం మధ్యాహ్నం లోకాయుక్తలో ఫిర్యాదు చేశారు. ప్రవీణ్ కుమార్‌ బినామి ఔట్ సోర్సింగ్ ఏజన్సీలు స్థాపించి, రాజ్యంగా వ్యతిరేకంగా సంస్థ లో ఉద్యోగాలన్నీ రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించకుండా ఏకపక్షంగా నియామకాలు జరిపి తెలంగాణ నిరుద్యోగుల‌కు అన్యాయం చేస్తున్నార‌ని ఆయ‌న ఆరోపించారు.


గురుకులంలో ప్ర‌వీణ్ కుమార్ హాయాంలో జరిపిన అక్రమ నియామకాల పై విచారణ జరిపి మళ్ళీ నోటిఫికేషన్ల ద్వారా ఆ ఉద్యోగాలు భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. సోసైటీల్లో నిర్మాణ కాంట్రాక్టు పనులన్నీ తన బావమరది కేశవ్ కి టెండర్లు పిలవకుండా అప్పగిస్తూ కోట్లాది రూపాయల అవినీతికి పాల్పడుతున్నారని దీని పై పూర్తి విచారణ చేప‌ట్టాల‌ని డిమాండ్ చేశారు. అర్థీక శాఖ అనుమతి లేకుండా 136 అక్రమ అసిస్టెంట్ కేర్ టేకర్ ఉద్యోగాలు సృష్టించి వారికి నెలకు 14వేల జీతం ఇస్తూ తన ప్రైవేటు సైన్యం స్వేరోల ద్వారా సొసైటీ లో సిబ్బంది పై అనాధికార పెత్తనం చేయిస్తున్నార‌ని ఆయ‌న అన్నారు.


ప్రవీణ్ చేసిన వాటికి ఎవ‌రైనా త‌ప్పు ప‌డితే వారిపై దాడులు చేయిస్తూ దాడులు చేసినందుకు కృతజ్ఞత గా వారికి మెస్ కాంట్రాక్టులు, కురగాయల, కాంట్రాక్టులు, కిరాణా కాంట్రాక్టులు ఇస్తూ అక్రమాలు చేస్తున్నారని పిర్యదు చేశారు.

GST లాంటి పన్నులు కాంట్రాక్టులు ఇచ్చిన స్వేరోలకు,పేరెంట్ కమిటీలకు స్వేరో ట్యాక్స్ నెలకు 1000 రూపాయలు అక్రమంగా వసూలు చేస్తుండని ఫిర్యాదు చేశారు. ముఖ్యమంత్రి, చీఫ్ సెక్రటెరీ, ప్రిన్సిపల్ సెక్రటెరీ సోషల్ వెల్ఫేర్,సంబంధిత మంత్రులకు ఫిర్యాదు చేస్తామని తెలిపారు.


 కోటూరి మానవతా రాయ్  పిర్యాదును స్వీకరించిన లోకాయుక్త  నోటిసులు జారీచేసిన తర్వాత వారం రోజులకు ప్ర‌వీణ్ ను విచారణకు రమ్మని తెలిపింది
 

Follow Us:
Download App:
  • android
  • ios