హైద్రాబాద్ నగరంలో ట్యాంక్ బండ్ పై బీఎండబ్ల్యూ కారు బీభత్సం సృష్టించింది.  ట్రాఫిక్ ను క్లియర్ చేస్తున్న  సీఐను కారు ఢీకొట్టింది.


హైదరాబాద్: నగరంలోని Tank Bund పై బీఎండబ్ల్యూ Carసోమవారం నాడు ఉదయం బీభత్సం సృష్టించింది. జనాలపైకి కారు దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఓ CI కు కూడా గాయాలయ్యాయి.
అంతేకాదు ఇన్స్‌పెక్టర్ పై కారు దూసుకెళ్లింది. దీంతో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. అతనిని వెంటనే ఆసుపత్రికి తరలించారు.

ఇవాళ ఉదయం ట్యాంక్ బండ్ పై ట్రాఫిక్ ను కంట్రోల్ చేస్తున్న ముషీరాబబాద్ సీఐ జహంగీర్ పై దూసుకెళ్లింది. జహంగీర్ ను వెంటనే ఆసుపత్రికి తరలించారు. సీఐ Jahangir ను ఆసుపత్రికి తరలించారు. ఆయనకు రెండు ఆపరేషన్లు నిర్వహించారు. సీఐ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్పారు. మరో 24 గంటల గడిస్తే కానీ జహంగీర్ ఆరోగ్య పరిస్థితిపై ఏం చెప్పలేమని వైద్యులు చెబుతున్నారు.

ఇటీవల కాలంలో Hyderabad నగరంలో కారు ప్రమాదాలు ఎక్కువౌతున్నాయి. నిర్లక్ష్యంగా కారు నడపడం వల్ల ప్రమాదాలు చోటు చేసుకొంటున్నాయి. నిర్లక్ష్యంగా, మద్యం తాగి వాహనాలు నడుపుతున్న ఘటనలు వెలుగు చూస్తున్నాయి.

ఈ నెల 17వ తేదీన రాత్రి జూబ్లీహిల్స్ వద్ద కారు ప్రమాదం జరిగింది.ఈ ప్రమాదంలో రెండు మాసాల చిన్నారి మరణించింది. మరో ముగ్గురు గాయపడ్డారు. బోధన్ ఎమ్మెల్యే కజిన్ మీర్జాతో పాటు ఆయన కొడుకును ఈ కేసులో అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఎమ్మెల్యే కొడుకు రాహిల్ కూడా ఉన్నారని పోలీసులు గుర్తించారు. 

ఈ నెల 18న గచ్చిబౌలి రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మరణించారు. జూనియర్‌ ఆర్టిస్ట్‌ గాయత్రి తన స్నేహితుడు రోహిత్‌తో కలిసి ప్రిసమ్‌ పబ్‌ నుండి వస్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకొంది. అతి వేగంగా కారు నడపడం వల్లే ప్రమాదానికి కారణామని తమ ప్రాథమిక విచారణలో తెలిసినట్లు పేర్కొన్నారు.

అతివేగంగా వచ్చిన వీరి కారు ఎల్లా హోటల్‌ ముందు ఫుట్‌పాత్‌ను ఢీ కొట్టి గాల్లోకి ఎగిరిపడింది. ఈ ప్రమాదంలో ఆ దగ్గర్లోనే గార్డెనింగ్‌ పనులు చేస్తున్న మహేశ్వరి(38)ని ఢీకొట్టడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. తీవ్రంగా గాయపడిన రోహిత్, జూనియర్‌ ఆర్టిస్ట్‌, యూట్యూబర్‌ గాయత్రిని గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రికి తరలించగా అప్పటికే గాయత్రి మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు