కారులోకి వర్షపు నీరు చేరి ఓ వ్యక్తి మృతి

car driver died in rain water at hyderabad
Highlights

కూకట్ పల్లి మయూరి కాంప్లెక్స్ సెల్లార్ లో కారు నిలిపివుండగా...

హైదరాబాద్ లో నిన్న రాత్రి కురిసిన వర్షపు నీటిలో మునిగి ఓ వ్యక్తి దారుణంగా మృతిచెందాడు. సెల్లార్ కారు నిలిపి అందులోనే డ్రైవర్ పడుకోగా వర్షపు నీరు ఆ కారులోకి చేరి ఊపిరాడక చనిపోయాడు. ఈ ఘటన కూకట్ పల్లి ప్రాంతంలో చోటుచేసుకుంది.

వావకాల్లోకి వెళితే... కూకట్ పల్లి జయానగర్ కాలనీలోని మయూరి రెసిడెన్సీలో నివాసముండే ఓ వ్యక్తి దగ్గర గోపి డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. అయితే నిన్న రాత్రి యజమానిని ఇంటి వద్ద దింపిన ఇతడు అక్కడే సెల్లార్ లో కారు నిలిపి అందులోనే పడుకున్నాడు. ఈ క్రమంలో రాత్రి కురిసిన భారీ వర్షానికి ఈ సెల్లాన్ లోకి వర్షపు నీరు భారీగా చేరాయి. ఈ డ్రైవర్ పడుకున్న కారులోకి కూడా వర్షపు చేరడంతో కారు డోర్స్ లాక్ అయిపోయాయి. దీంతో గోపి కారులోంచి బయటకు రాలేక ఊపిరాడక మృతి చెందాడు.

ఈ విషయాన్ని గుర్తించిన అపార్ట మెంట్ వాసులు పోలీసులు, అగ్ని మాపక సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్ని మాపక సిబ్బంది సెల్లార్ లో నిండిపోయిన వర్షపు నీటిని మైటార్లను తో తోడి మృతదేహాన్ని బైటికి తీశారు. మృతదేహాన్ని పోస్టు మార్టం కోసం గాంధీ ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఈ దుర్ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


 

loader