హుస్సేన్ సాగర్ వద్ద కారు బీభత్సం: ఆరాంఘర్ ప్రమాదంలో ఒకరి మరణం
హైదరాబాద్ లోని రెండు వేర్వేరు చోట్ల రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. హుస్సేన్ సాగర్ సమీపంలో జరిగిన ఓ ప్రమాదంలో ఎవరికీ తీవ్ర గాయాలు కానప్పటికీ.. అరాంఘర్ చౌరస్తాలో జరిగిన ప్రమాదంలో ఒకరు చనిపోయారు.

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులో రెండు చోట్ల ఘోర ప్రమాదాలు సంభవించాయి. హుస్సేన్ సాగర్ వద్ద ఓ కారు బీభత్సం స్రుష్టించింది. ఎన్టీఆర్ మార్గ్ లో కారు ట్యాంక్ బండ్ రెయిలింగ్ ను ఢీకొట్టింది. సమయానికి ఎయిర్ బెలూన్లు తెరుచుకోవడంతో ప్రయాణికులు బయటపడ్డారు. కారులో ఇద్దరు ప్రయాణించినట్లు అనుమానిస్తున్నారు. కారు నుజ్జు నుజ్జు అయింది. దాంతో ప్రయాణికులు కారును అక్కడే వదిలేసి పారిపోయారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
నిజామాబాద్ లో విషాదం.. నిద్రిస్తున్న బాలుడిపై పడి కాటేసిన పాములు.. చికిత్స పొందుతూ మృతి..
ఇదిలావుంటే, ఆరాంఘర్ చౌరస్తా వద్ద ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో బైక్ మీద ప్రయాణిస్తున్న వ్యక్తి అక్కడికక్కడే మరణించారు. బైక్, కారు విద్యుత్తు స్తంభాన్ని ఢీకొన్నాయి. కారులో ప్రయాణిస్తున్నవారు మద్యం సేవించినట్లు తెలుస్తోంది. కారులో మద్యం సీసాలు కనిపించాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.