హైదరాబాద్ శివార్లలో దారుణం జరిగింది. గుర్రంగూడలోని గోకార్టింగ్ ప్లే జోన్‌లో బీ టెక్ యువతి ప్రాణాలు కోల్పోయింది. యువకుడు కారు నడుపుతుండగా పక్కనే కూర్చొన్న యువతి తల వెంట్రుకలు టైర్‌కు చుట్టుకుపోవడంతో ఆమె ఒక్కసారిగా కారలోంచి ఎగిరిపడి తలకు తీవ్రగాయాలయ్యాయి.

హెల్మెట్ కూడా పగిలిపోయే స్థాయిలో తల బలంగా నేలకు తగలడంతో తీవ్రగాయాలతో విద్యార్ధిని శ్రీవర్షిణి అక్కడికక్కడే చనిపోయింది. గో కార్టింగ్ నిర్వాహకుల నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా మీర్ పేట పోలీసులకు ఫిర్యాదు చేశారు.