కళ్లలో కారంకొట్టి, కత్తితో దాడిచేసి, బండరాయితో మోది ఓ వ్యక్తి హత్య

Brutal murder in Hyderabad
Highlights

హైదరాబాద్ లో ఓ వ్యక్తిని గుర్తు తెలియని దుండగులు దారుణంగా హతమార్చారు. రాజేంద్ర నగర్ పరిధిలో అత్తాపూర్ పిల్లర్ నెంబర్ 143 వద్ద  ఓ వ్యక్తిని బండరాయితో మోది దారుణంగా హతమార్చారు. 
 

హైదరాబాద్ లో ఓ వ్యక్తిని గుర్తు తెలియని దుండగులు దారుణంగా హతమార్చారు. రాజేంద్ర నగర్ పరిధిలో అత్తాపూర్ పిల్లర్ నెంబర్ 143 వద్ద  ఓ వ్యక్తిని బండరాయితో మోది దారుణంగా హతమార్చారు. 

ఈ దారుణానికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. మహ్మద్ ఖాలిద్(30) అనే వ్యక్తి బహదూర్ పురా లో నివాసముంటున్నాడు. ఇతడు అదే ప్రాంతంలో వాటర్ ప్లాంట్ ను నడుపుతున్నాడు. అయితే  ఖూలేద్ ని  అత్తాపూర్ ప్రాంతంలో కొందరు గుర్తు తెలియని దుండగులు దాడికి తెగబడ్డారు. ఖాలెద్ కళ్లలో కారం కొట్టిన దుండగులు ఆపై అతడి గొంతు కోశారు. అప్పటికి అతడు కొనఊపిరితో కొట్టుకుంటుండంతో బండరాయితో మోది చంపినట్లు పోలీసులు గుర్తించారు.

ఈ ఘటనపై సమాచారం అందుకున్న రాజేంద్ర నగర్ పోలీసులు డాగ్ స్వాడ్, క్లూస్ టీంలతో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పరిశీలించిన పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ హత్యకు ఆర్థిక లావాదేవీలే కారణమై ఉంటాయని పోలీసులు అనుమానిస్తున్నారు.

 
 

loader