నిర్మల్ జిల్లాలో అధికార బీఆర్‌ఎస్ పార్టీకి షాక్ తగిలింది. సారంగాపూర్ మండలానికి చెందిన అధికార పార్టీ జెడ్పీటీసీ పత్తిరెడ్డి రాజేశ్వర్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు.
నిర్మల్ జిల్లాలో అధికార బీఆర్‌ఎస్ పార్టీకి షాక్ తగిలింది. సారంగాపూర్ మండలానికి చెందిన అధికార పార్టీ జెడ్పీటీసీ పత్తిరెడ్డి రాజేశ్వర్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో పత్తిరెడ్డి రాజేశ్వర్ రెడ్డికి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో అద్దంకి దయాకర్‌తో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. ఇక, పత్తిరెడ్డి రాజేశ్వర్ రెడ్డి నిర్మల్ జిల్లా జేడ్పీటీసీల సంఘం అధ్యక్షులుగా కొనసాగుతున్నారు.
ఇక, పత్తిరెడ్డి రాజేశ్వర్ రెడ్డి గత కొంతకాలంగా బీఆర్ఎస్ అధిష్టానంపై అసంతృప్తితో ఉన్నారు. ఇటీవల బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనాలకు కూడా ఆయన దూరంగా ఉంటూ వస్తున్నారు. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి వైఖరిపై గుర్రుగా ఉన్న పత్తిరెడ్డి రాజేశ్వర్ రెడ్డి బీఆర్ఎస్‌కు గుడ్ బై చెప్పి కాంగ్రెస్‌లో చేరినట్టుగా తెలుస్తోంది.
