తెలంగాణలో  ఇప్పుడు  ఎన్నికలు  వచ్చినా  బీఆర్ఎస్ కు  105 సీట్లు వస్తాయని  తెలంగాణ సీఎం  కేసీఆర్  చప్పారు. 

హైదరాబాద్: ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే తెలంగాణలో బీఆర్ఎస్ కు 104 సీట్లు వస్తాయని తెలంగాణ సీఎం కేసీఆర్ చెప్పారు. బుధవారంనాడు బీఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశంలో కేసీఆర్ పార్టీ నేతలకు దిశా నిర్ధేశం చేశారు. గత పదేళ్లలో ప్రజలకు ఏం చేశామో ప్రజలకు వివరించాలని కేసీఆర్ చెప్పారు. ప్రజలకు చేసిన సేవ గురించి వివరిస్తే చాలన్నారు. 70 ఏళ్లలో కాంగ్రెస్ ప్రజలకు ఏం చేసిందని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను ఆయా జిల్లాల్లో మంత్రులు పర్యవేక్షించాలని సీఎం కేసీఆర్ సూచించారు. 

తెలంగాణ రాకముందు ఉన్న పరిస్థితులను తెలంగాణ వచ్చిన తర్వాత మారిన పరిస్థితులను ప్రజలకు వివరించాలని కేసీఆర్ కోరారు. మరో ఆరు మాసాల్లో ఎన్నికలు వస్తాయని కేసీఆర్ చెప్పారు. ఎన్నికల సమయంలో ప్రజల మధ్యే ఉండాలని ఆయన పార్టీ నేతలకు సూచించారు. ఎన్నికల షెడ్యూల్ తీసేస్తే ఐదు నెలలే ఉంటుందని కేసీఆర్ చెప్పారు. ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు పూర్తిగా నియోజకవర్గాలకే పరిమితం కావాలని ఆయన సూచించారు. 

also read:తెలంగాణలో బీఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశం ప్రారంభం: కీలకాంశాలపై నేతలకు కేసీఆర్ దిశానిర్ధేశం

దశాబ్ది ఉత్సవాలను ప్రజలతో కలిపి జరుపుకోవాలని కేసీఆర్ కోరారు. తెలంగాణ తెచ్చింది మనమే, ప్రభుత్వ పరంగా అభివృద్ది చేసింది కూడా మనమేననే విషయాన్ని ప్రజలకు వివరించాలని కేసీఆర్ పార్టీ నేతలకు చెప్పారు.