తెలంగాణలో బీఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశం ప్రారంభం: కీలకాంశాలపై నేతలకు కేసీఆర్ దిశానిర్ధేశం

 తెలంగాణ భవన్ లో  ప్రారంభమైన   బీఆర్ఎస్  విస్తృతస్థాయి సమావేశం  ఇవాళ  ప్రారంభమైంది.  

BRS  key meeting  begins  in Telangana Bhavan lns

హైదరాబాద్: బీఆర్ఎస్  విస్తృతస్థాయి సమావేశం  బుధవారంనాడు   తెలంగాణ భవన్ లో  ప్రారంభమైంది.  తెలంగాణ సీఎం  కేసీఆర్ అధ్యక్షతన ఈ సమావేశం  జరుగుతంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు,  ఆ పార్టీకి  చెందిన ప్రజా ప్రతినిధులు , నేతలు  ఈ సమావేశంలో  పాల్గొన్నారు. 

ఈ ఏడాది జూన్  రెండో తేదీకి  తెలంగాణ రాష్ట్రం  ఏర్పడి  9 ఏళ్లు  పూర్తి కానున్నాయి. దీంతో  తెలంగాణ రాష్ట్ర  ఏర్పాటుపై  జూన్ రెండు  నుండి 21  రోజుల పాటు  తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది  ఉత్సవాలను నిర్వహించనున్నారు.  దశాబ్ది  ఉత్సవాలను  ప్రజల్లోకి వెళ్లేందుకు  ఎలా ఉపయోగించుకోవాలనే దానిపై  నేతలకు  కేసీఆర్ దిశానిర్ధేశం  చేయనున్నారు. 

ఆరు మాసాల్లో  తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ  ఎన్నికలు  జరగనున్నాయి.  కర్ణాటక  రాష్ట్ర అసెంబ్లీ  ఎన్నికల ఫలితాలు  తెలంగాణపై  ఏమైనా ప్రభావం చూపే అవకాశం ఉందా అనే విషయమై  కూడ కేసీఆర్  పార్టీ నేతలతో  చర్చించే అవకాశం ఉంది. మరో వైపు  తెలంగాణలో  వెంటనే  ఎన్నికలు  జరిగితే  ఏ పార్టీకి  ఎన్ని  సీట్లు  దక్కుతాయనే విషయమై  కేసీఆర్  వివరించే  అవకాశం ఉంది.  ఆయా నియోజకవర్గాల్లో  ఎమ్మెల్యేల  పరిస్థితిపై  కేసీఆర్  కొంత  సమాచారం  ఇచ్చే అవకాశం లేకపోలేదు.  ఏయే నియోజకవర్గాల్లో  బీజేపీ, కాంగ్రెస్ ల నుండి  పోటీ  ఉంటుందనే విషయమై   కేసీఆర్  సమాచారం  ఇచ్చే అవకాశం ఉందని  సమాచారం. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios