నలుగురు అభ్యర్థులను ప్రకటించిన బీఆర్ఎస్.. కవితకు మరో ఛాన్స్
బీఆర్ఎస్ పార్టీ నాలుగు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. కరీంనగర్ నుంచి వినోద్ కుమార్, పెద్దపల్లి నుంచి కొప్పుల ఈశ్వర్‌ను అభ్యర్థులుగా ప్రకటించింది. ఖమ్మం నుంచి నామా నాగేశ్వరరావు, మహబూబాబాద్ నుంచి మాలోతు కవితకు బీఆర్ఎస్ మరో ఛాన్స్ ఇచ్చింది.
![brs party announces four candidates for loksabha elections kms brs party announces four candidates for loksabha elections kms](https://static-gi.asianetnews.com/images/01hph995txf4m69d0246zvc5zn/untitled-design--74--png_363x203xt.jpg)
వచ్చే లోక్ సభ ఎన్నికల కోసం బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను ప్రకటిస్తున్నది. తొలిగా ఈ పార్టీ నాలుగు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. నిన్న కరీంనగర్, పెద్దపల్లి లోక్ సభ నియోజకవర్గ ముఖ్య నాయకులతో కేసీఆర్ తెలంగాణ భవన్‌లో భేటీ అయ్యారు. ఈ రోజు ఖమ్మం, మహబూబాబాద్ పార్లమెంటరీ సెగ్మెంట్‌లోని బీఆర్ఎస్ ముఖ్య నేతలతో ఆయన సమావేశం అయ్యారు. అనంతరం ఈ నాలుగు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు.
ఖమ్మం నుంచి నామా నాగేశ్వరరావు, మహబూబాబాద్ నుంచి మాలోతు కవితలకు బీఆర్ఎస్ పార్టీ మరోసారి ఛాన్స్ ఇచ్చింది. వీరితోపాటు కరీంనగర్ నుంచి బోయినపల్లి వినోద్ కుమార్,పెద్దపల్లి నుంచి కొప్పుల ఈశ్వర్‌లను అభ్యర్థులుగా ప్రకటించింది.
Also Read: Prashant Kishor: బీఆర్ఎస్ గెలుస్తుందనీ చెప్పాడు.. పీకే గురి తప్పింది: వైసీపీ
నామా నాగేశ్వరరావు ఖమ్మం నుంచి, మాలోతు కవిత మహబూబాబాద్ నుంచి గత లోక్ సభ ఎన్నికల్లో దాదాపు లక్షన్నర ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.
అంతేకాదు, లోక్ సభ ఎన్నికల కోసం క్యాంపెయినింగ్‌కూ బీఆర్ఎస్ ప్లాన్ వేసుకుంది. ఈ నెల 12వ తేదీన కరీంనగర్‌లోని ఎస్ఆర్ఆర్ కాలేజీలోని గ్రౌండ్‌లో భారీ బహిరంగ సభకు నిర్ణయం తీసుకుంది. కేసీఆర్ ఈ సభలో మాట్లాడునున్నారు.
![left arrow](https://static-gi.asianetnews.com/v1/images/left-arrow.png)
![right arrow](https://static-gi.asianetnews.com/v1/images/right-arrow.png)