ప్రశాంత్ కిశోర్ చేసిన వ్యాఖ్యలను వైసీపీ తిప్పికొట్టింది. ఆయన చేసిన వ్యాఖ్యలు అహేతుకం, అవాస్తవ అంచనాలని పేర్కొంది. ఆయన ఇటీవలే తెలంగాణలో బీఆర్ఎస్, రాజస్తాన్‌లో కాంగ్రెస్ గెలుస్తుందని అంచనా వేసి తప్పాడని వివరించింది.
ప్రశాంత్ కిశోర్ చేసిన వ్యాఖ్యలను వైసీపీ తిప్పికొట్టింది. ప్రశాంత్ కిశోర్ అంచనాలు అహేతుకమని పేర్కొంది. ఆయన అంచనాలు గురి తప్పాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా హ్యాండిల్ తెలిపింది. తెలంగాణలో బీఆర్ఎస్ గెలుస్తుందని, రాజస్తాన్‌లో కాంగ్రెస్ గెలుస్తుందని ప్రశాంత్ కిశోర్ ఎన్నికలకు ముందు అంచనా వేశాడని ఈ సందర్భంగా వివరించింది. అయితే.. ఇక్కడ ఫలితాలు వేరుగా వచ్చాయని తెలిపింది. మరొక విషయాన్ని మరిచిపోరాదని, ఆయన బిహార్‌లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగారని వివరించింది. ఆయన చెబుతున్న అంచనాలకు ఆధారం ఏమిటని ప్రశ్నించింది.
ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్‌లో జరిగిన ఓ కాంక్లేవ్‌లో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ విజయం సాధిస్తుందని, జగన్ ఓటమి తప్పదని ఆయన జోస్యం చెప్పారు. సీఎం జగన్ తాడేపల్లి ప్యాలెస్‌లో కూర్చొని పథకాల పేరుతో డబ్బులు ఇస్తున్నారని దాని వల్ల ఓట్లు పడవన్నారు. తెలంగాణలో కేసీఆర్ ఓటమికి కూడా అదే కారణమన్నారు. సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా ముఖ్యమన్న పీకే.. రాష్ట్రంలో ప్రజలు మార్పును కోరుకుంటున్నారని చెప్పారు. ఈసారి ఏం చేసినా జగన్ గెలవడం కష్టమని ప్రశాంత్ కిశోర్ వెల్లడించారు.
