Asianet News TeluguAsianet News Telugu

పదవులకు రాజీనామా చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు.. ఎందుకంటే ?

బీఆర్ఎస్ ఎమ్మెల్సీలుగా ఉన్న పల్లా రాజేశ్వర్ రెడ్డి, కడియం శ్రీహరి, పాడి కౌశిక్ రెడ్డి లు తమ పదవులకు రాజీనామా చేశారు. ఇటీవల తెలంగాణ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో వీరంతా ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. అందుకే శాసన మండలి సభ్యత్వానికి రాజీనామా చేశారు. 

BRS MLCs who resigned from their positions.. because?..ISR
Author
First Published Dec 9, 2023, 1:17 PM IST

తెలంగాణ శాసన మండలి సభ్యత్వానికి పల్లా రాజేశ్వర్ రెడ్డి, కడియం శ్రీహరి, పాడి కౌశిక్ రెడ్డి రాజీనామా చేశారు. ఇటీవల తెలంగాణ శాసన సభ (అసెంబ్లీ)కి జరిగిన ఎన్నికల్లో వీరంతా ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. ఈ నేపథ్యంలో తమ ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేశారు. తమ రాజీనామా పత్రాలను వీరంతా శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి అందజేశారు. ఆయన వాటికి ఆమోద ముద్ర వేశారు.

తెలంగాణ మంత్రులకు శాఖలు కేటాయింపు.. కొత్త ఐటీ మినిస్టర్ ఆయనే..

ఈ సారి ఎమ్మెల్యేలుగా ఎన్నికైన పలువురు శాసన మండలిలో, లోక్ సభలో సభ్యులుగా ఉన్నారు. నిబంధనల ప్రకారం ఒక వ్యక్తి ఒకే సభలో సభ్యుడిగా ఉండాలి. ఈ నేపథ్యంలో వారు ఏదో ఒక పదవికి తప్పనిసరిగా రాజీనామా చేయాల్సి ఉంటుంది. అందుకే మల్కాజ్ గిరి నుంచి లోక్ సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న రేవంత్ రెడ్డి కూడా తన సభ్యత్వానికి రాజీనామ చేశారు. ఆయన ఈ సారి కొడగంల్ నుంచి శాసన సభకు భారీ మెజారిటీతో గెలుపొందని సంగతి తెలిసిందే. 

తుమ్మినా, దగ్గినా కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోతుంది.. అందుకే ఎంఐఎంతో లోపాయికారి ఒప్పందం - కిషన్ రెడ్డి

అలాగే భువనగిరి నుంచి ఎంపీగా ఉన్న కోమటిరెడ్డి వెంకట రెడ్డి, నల్గొండ ఎంపీగా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఈ సారి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. వీరిద్దరూ కూడా తమ ఎంపీ పదవులకు రాజీనామాలు సమర్పించారు. వీరిద్దరూ ఇప్పుడు రేవంత్ రెడ్డి కేబినేట్ లో మంత్రులుగా ఉన్నారు. తాజాగా వీరికి శాఖల కేటాయింపు కూడా జరిగింది. కోమటి రెడ్డి వెంకట రెడ్డికి రోడ్డు, భవనాల శాఖ, ఉత్తమ్ కుమార్ రెడ్డికి పౌరసరఫరాలు, నీటి పారుదల శాఖను కేటాయించారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios