తెలంగాణ రైతులపై కక్ష ఎందుకు: ఉచిత విద్యుత్ పై రాహుల్ ను ప్రశ్నించిన కవిత

ఉచిత విద్యుత్ పై  టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వ్యాఖ్యల నేపథ్యంలో  బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్ధం సాగుతుంది.  ఈ విషయమై  రాహుల్ గాంధీపై  కల్వకుంట్ల  కవిత ట్విట్టర్ వేదికగా  విమర్శలు  చేశారు.

BRS  MLC  Kalvakuntla Kavitha  Slams  Rahul Gandhi Over  Free Electricity to Farmers lns

హైదరాబాద్: రైతులకు మూడు గంటల పాటు ఉచిత విద్యుత్ ఇస్తే సరిపోతుందని  టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి  తానా సభల్లో  వ్యాఖ్యానించారు.ఈ వ్యాఖ్యలు  తెలంగాణ రాజకీయాల్లో పెను దుమారం రేపాయి.  బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు  ఈ విషయమై పరస్పరం విమర్శలు చేసుకుంటున్నాయి. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను నిరసిస్తూ  బీఆర్ఎస్ ఇవాళ నిరసనలకు పిలుపునిచ్చింది.  పోటీగా  కాంగ్రెస్ కూడ  ఇవాళ  రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలను నిర్వహించనుంది.  ఉచిత విద్యుత్ పై బీఆర్ఎస్ ప్రజలను మోసం  చేస్తుందని  కాంగ్రెస్ ఆరోపిస్తుంది. ఈ తరుణంలో  బీఆర్ఎస్ ఎమ్మెల్సీ  కల్వకుంట్ల కవిత  బుధవారంనాడు  ట్విట్టర్ వేదికగా  కాంగ్రెస్ పై విమర్శలు గుప్పించారు.  ఈ ట్వీట్ ను  రాహుల్ గాంధీకి ట్యాగ్ చేశారు.

కాంగ్రెస్ పార్టీ పాలిస్తున్న రాష్ట్రాల్లో  24 గంటల పాటు ఉచిత విద్యుత్ ను  ఇవ్వలేకపోతున్నందున తెలంగాణ రైతులను కూడ ఇబ్బందికి గురి చేయాలనుకుంటున్నారా అని ఆమె ప్రశ్నించారు.  రైతుల ప్రయోజనాలను  బీఆర్ఎస్ కాపాడుతుందని  ఆమె  స్పష్టం  చేశారు.  అంతేకాదు ప్రతి రైతుకు  తాము అండగా నిలబడుతామని  కవిత  తేల్చి చెప్పారు.

also read:ఉచిత విద్యుత్ పై రేవంత్ వ్యాఖ్యల చిచ్చు: రెండు రోజుల పాటు నిరసనలకు బీఆర్ఎస్ పిలుపు

రైతులకు  మూడు గంటల పాటు  ఉచిత విద్యుత్ ఇస్తే సరిపోతుందని  టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఇచ్చిన స్టేట్ మెంట్ చూసి తాను  షాక్ కు గురైనట్టుగా  కవిత  చెప్పారు. రైతులకు  24 గంటల పాటు ఉచిత విద్యుత్ సరఫరా విషయంలో ఏ రాజకీయ పార్టీకైనా ఇబ్బంది ఎలా ఉంటుందని ఆమె ప్రశ్నించారు. 

 

తానా సమావేశాలకు  హాజరైన రేవంత్ రెడ్డి  రైతులకు  ఉచిత విద్యుత్ మూడు గంటలు ఇస్తే  సరిపోతుందని  వ్యాఖ్యానించారని  సోషల్ మీడియాలో ప్రచారం సాగుతుంది.  రేవంత్ రెడ్డి  వ్యాఖ్యలను బీఆర్ఎస్ వక్రీకరిస్తుందని  కాంగ్రెస్  నేతలు  చెబుతున్నారు.  రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను  నిరసిస్తూ  నిన్న , ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా  కాంగ్రెస్ పార్టీ నిరసనలకు  పిలుపునిచ్చింది.  ఉచిత విద్యుత్ విషయంలో  బీఆర్ఎస్ నేతల తీరుపై  కాంగ్రెస్ కూడ  పోటీ నిరసనలకు ఇవాళ దిగనుంది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios