డాక్టర్ ప్రీతి ఆత్మహత్య.. దోషులను వదిలేది లేదు, ఆ కుటుంబానికి అండగా వుంటాం : ఎమ్మెల్సీ కవిత

వరంగల్ మెడికల్ కాలేజ్ విద్యార్ధిని ప్రీతి కుటుంబానికి అండగా వుంటామన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. ప్రీతి మరణానికి కారణమైన వారిని వదిలిపెట్టేది లేదని కవిత స్పష్టం చేశారు.

brs mlc kalvakuntla kavitha gave assurance to doctor preethi family

వరంగల్ మెడికల్ కాలేజ్ విద్యార్ధిని ప్రీతి ఆత్మహత్య వ్యవహారం తెలుగు రాష్ట్రాలను కుదిపేసిన సంగతి తెలిసిందే. సీనియర్ వేధింపులు భరించలేక ప్రమాదకర ఇంజెక్షన్ తీసుకున్న ఆమె.. ఐదు రోజుల పాటు మృత్యువుతో పోరాడి హైదరాబాద్ నిమ్స్‌లో ప్రాణాలు విడిచింది. దీంతో ప్రీతి కుటుంబ సభ్యులు, విద్యార్ధి, ప్రజా సంఘాలు భగ్గుమన్నాయి. ప్రీతికి న్యాయం చేయాలంటూ ఆందోళనకు దిగాయి. అప్పటికి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు జోక్యం చేసుకుని ఆందోళన విరమించేలా చూశారు. 

ఇదిలావుండగా.. ప్రీతి మరణంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి వైద్య విద్యను చదువుతోన్న ప్రీతికి ఇలా జరగడం జీర్ణించుకోలేకపోతున్నామన్నారు. ఏ తల్లిదండ్రులకు ఇలాంటి పరిస్ధితి రాకూడదని.. బాధిత కుటుంబానికి ప్రభుత్వం, బీఆర్ఎస్ పార్టీ అండగా వుంటుందని కవిత హామీ ఇచ్చారు. ప్రీతి మరణానికి కారణమైన వారిని వదిలిపెట్టేది లేదని కవిత స్పష్టం చేశారు. 

Also REad: ఈ బి*** ప్రీతి చావు గురించి మాట్లాడదు...'అరె నాకేం సంబంధం' రష్మీ ఫైర్!

వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రిలో అనస్థీషియ విభాగంలో పీజీ మొదటి సంవత్సరంలో చేరిన ప్రీతి.. సీనియర్ విద్యార్థి ఎంఏ సైఫ్ వేధింపులు భరించలేక ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది. ఈనెల 22న ఉదయం ఓ మత్తు ఇంజక్షన్ తీసుకొని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించిందని మొదట కథనాలు వెలువడ్డాయి. ఎమర్జెన్సీ ఆపరేషన్ థియేటర్లో స్పృహ లేని స్థితిలో పడి ఉన్న ఆమెని ఎంజీఎం ఆసుపత్రిలోనే మొదట అత్యవసర చికిత్స అందించారు.

అయితే ఆమె ఆరోగ్య పరిస్థితి  విషమిస్తుండడంతో..  అదే రోజు హైదరాబాదులోని నిమ్స్ ఆసుపత్రికి అక్కడి నుంచి తరలించారు.  అప్పటినుంచి నిమ్స్ ఆసుపత్రిలోనే చికిత్స జరిగింది. కానీ ప్రీతి ఆరోగ్యంలో ఎలాంటి మార్పు లేదు. ఆమెను కాపాడేందుకు ఐదుగురు వైద్యుల ప్రత్యేక బృందం విశ్వప్రయత్నాలు చేసింది. ఇంజక్షన్ ప్రభావం వల్ల ఆమె శరీరం లోపలి అవయవాలు అన్ని దెబ్బతిన్నాయని.. దీనివల్ల చికిత్సకు శరీరం ఏమాత్రం స్పందించలేకపోతుందని తెలిపారు. ఈ క్రమంలో ఆదివారం నిమ్స్‌లో చికిత్స పొందుతూ ప్రీతి ప్రాణాలు కోల్పోయింది. 

Also Read: ప్రీతి మృతికి రూ. 50 లక్షల అడ్మిషన్ బాండ్ కూడా కారణమేనా? వెలుగులోకి కొత్త ట్విస్ట్.. చివరిమాటల్లో ఏముంది??

ఇకపోతే.. సోమవారం ప్రీతి అంత్యక్రియలు ముగిశాయి. ప్రీతి స్వగ్రామం జనగామ  జిల్లా గిర్ని తండాలో ఆమె అంత్యక్రియలను నిర్వహించారు. అంత్యక్రియలకు ముందు  ప్రీతి మృతదేహానికి గిరిజన సంప్రదాయం ప్రకారం సంస్కారాలు నిర్వహించారు. ప్రీతికి కుటుంబ సభ్యులు, గ్రామస్థులు ఆశ్రునయనాలతో వీడ్కోలు పలికారు. చుట్టుపక్కల గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు ప్రీతి అంత్యక్రియలకు హాజరయ్యారు. పలువురు రాజకీయ నాయకులు కూడా గిర్ని తండాకు చేరుకుని ప్రీతికి నివాళులర్పించారు. ఆమె కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఎంఆర్‌పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ కూడా ప్రతీ అంత్యక్రియలకు హాజరయ్యారు. ప్రీతి అంత్యక్రియల్లో పాల్గొన్న మందకృష్ణ మాదిగ.. ఆమె పాడె మోశారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios