ఈ బి*** ప్రీతి చావు గురించి మాట్లాడదు...'అరె నాకేం సంబంధం' రష్మీ ఫైర్!
యాంకర్ రష్మీ గౌతమ్ పై ఓ నెటిజెన్ అసహనం వ్యక్తం చేశాడు. బూతులు తిడుతూ అనుచిన ట్వీట్ చేశారు. సదరు ట్వీట్ కి రష్మీ రిప్లై ఇచ్చారు.
ఒక్క ఘటన రష్మీ గౌతమ్ ని ఇబ్బందుల్లోకి నెట్టింది. నెటిజెన్స్ ఆమెను తీవ్రంగా దూషిస్తున్నారు. అనుచిత కామెంట్స్ తో ఇబ్బంది పెడుతున్నారు. ఇటీవల హైదరాబాద్ లో నాలుగేళ్ళ బాలుడు వీధి కుక్కల దాడిలో మరణించాడు. ఈ ఉదంతం జనాల్లో ఆగ్రహావేశాలు రగిల్చింది. వీధి కుక్కలకు మద్దతుగా ఎవరు మాట్లాడినా తీవ్రగా దూషిస్తున్నారు. ఇక రష్మీ గౌతమ్ చాలా కాలంగా మూగజీవాలకు మద్దతుగా సోషల్ మీడియా ఉద్యమం. ఎవరైనా వీధి కుక్కలను హింసిస్తే చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేస్తుంటారు.
ఇక బాలుడుకి జరిగిన ఉదంతంలో కూడా రష్మీ వీధి కుక్కలది తప్పేమీ లేదన్నట్లు మాట్లాడారు. చిన్న పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులదేనని రష్మీ కామెంట్స్ చేశారు. రష్మీ తీరు మరింతగా కోపం తెప్పించింది. బూతులు తిడుతూ రష్మీని టార్గెట్ చేశారు. ఒకరు రష్మిని కుక్కను కొట్టినట్లు కొట్టాలంటూ ట్వీట్ చేయగా... మరొకరు యాసిడ్ దాడి చేస్తా, చేతబడి చేయిస్తా అంటూ బెదిరింపులకు దిగారు. తనపై జరుగుతున్న సోషల్ మీడియా దాడిని ఎప్పటికప్పుడు రష్మీ తెలియజేస్తున్నారు.
తాజాగా ఒక నెటిజెన్ 'ఈ బి*** ప్రీతీ మరణం మీద ఒక్క మాట మాట్లాడదు' అని ఆమెను ట్యాగ్ చేసి ట్వీట్ చేశాడు. సదరు ట్వీట్ కోట్ చేస్తూ రష్మీ... ''అసలు ఏమైనా సంబంధం ఉందా. చూస్తుంటే నేను చేసే షోలు, ధరించే దుస్తుల వలనే ఈ దారుణాలు జరుగుతున్నాయని అనేలా ఉన్నారు. అసలు చెప్పాలంటే నా మాటలు, చేతలతో మీకు ఎలాంటి సంబంధం లేదు'' అని రిప్లై ఇచ్చింది.
— rashmi gautam (@rashmigautam27) February 28, 2023
కుక్కల తరపున మాట్లాడే రష్మీ వేధింపుల కారణంగా సూసైడ్ చేసుకున్న డాక్టర్ ప్రీతి గురించి మాట్లాడదు. కుక్కల ప్రాణాలకు ఉన్న విలువ రష్మీ దృష్టిలో మనుషులకు లేదు అనే అర్థంలో ఆ నెటిజెన్ కామెంట్ చేశాడు. అసలు నాకేం సంబంధం. నేను ఎందుకు మాట్లాడాలి. ప్రపంచంలో ఎవరికి ఎలాంటి అన్యాయం జరిగినా నేనే కారణం అన్నట్లు మాట్లాడుతున్నారని... ఆమె కౌంటర్ ఇచ్చారు.
మొత్తంగా రష్మీకి సోషల్ మీడియా వేధింపులు ఎక్కువయ్యాయి. రష్మీ తన సిద్ధాంతం మూగజీవాల రక్షణ అని చెబుతుంది. కుక్కల ప్రాణాలకు ఉన్న విలువ మనుషులకు లేదా అని జనాలు ప్రశ్నిస్తున్నారు. ఈ గొడవ సమాధానం లేని డిబేట్ గా కొనసాగుతుంది. కాగా దర్శకుడు రామ్ గోపాల్ వర్మ వీధి కుక్కల దాడిలో కన్నుమూసిన పిల్లాడి తరపున పోరాడుతున్నారు. వరుస పోస్ట్స్ తో ప్రభుత్వాన్ని, సంబంధిత అధికారులను ఏకిపారేస్తున్నాడు.