సుప్రీంకోర్టులో ముందస్తు పిటిషన్లు దాఖలు చేయలేదు: కవిత

తాను  సుప్రీంకోర్టులో  ఇవాళ  ఎలాంటి  ముందస్తు  పిటిషన్లు దాఖలు  చేయలేదని  బీఆర్ఎస్ ఎమ్మెల్సీ  కల్వకుంట్ల కవిత  ప్రకటించారు.  

BRS  MLC  Kalvakuntla  Kavitha  Clarifies  On Early  Petition  in  Supremec Court

హైదరాబాద్: తాను  సుప్రీంకోర్టులో  ఇవాళ ఎలాంటి పిటిషన్లు దాఖలు చేయలేదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత  ప్రకటించారు.  తన పిటిషన్ ను  ముందస్తుగా  విచారించాలని  కోరుతూ  సుప్రీంకోర్టులో  తాను  ఎలాంటి  పిటిషన్లు దాఖలు  చేయలేదని  కవిత తేల్చి  చెప్పారు.

 

 

 

 గతంలో తాను దాఖలు  చేసిన పిటిషన్ పై  ఈ నెల  24న సుప్రీంకోర్టులో  విచారణ జరగనుందని ఆమె వివరించారు.  ఈ నెల  15వ తేదీన  ఈడీ విచారణపై  బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈడీ  విచారణపై  సుప్రీంకోర్టులో  పిటిషన్ దాఖలు  చేశారు.ఈ పిటిషన్ పై విచారణను  ఈ నెల  24న విచారణ  చేస్తామని   సుప్రీంకోర్టు  ప్రకటించింది.  మరో వైపు  ఈ నెల  20వ తేదీన  విచారణకు హాజరు కావాలని  కవితకు  ఈడీ నోటీసులు  జారీ చేసింది.  ఈ నెల  16న ఈడీ విచారణకు  కవిత హాజరు కాలేదు.

 సుప్రీంకోర్టు విచారణ తర్వాతే విచారణకు  హాజరు కానున్నట్టుగా కవిత  ఈడీకి  లేఖ పంపారు.  కానీ  ఈ నెల  20వ తేదీనే విచారణకు  రావాలని కవిత  ఈడీ అధికారులు  నిన్న  సమన్లు  పంపారు.  దరిమిలా  తన  పిటిషన్ ను  ముందస్తుకు  విచారించాలని  సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశం ఉందని మీడియాలో కథనాలు వచ్చాయి. అయితే  తాను  ఈ విషయమై  సుప్రీంకోర్టును తన  పిటిషన్ ను మందస్తుగా  విచారించాలని  పిటిషన్ దాఖలు  చేయలేదని  కవిత  ప్రకటించారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios