బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ప్రలోభాల కేసు: సీబీఐకి చేరిన హైకోర్టు తీర్పు కాపీ

ఎమ్మెల్యేల ప్రలోభాల కేసుకు సంబంధించి  తెలంగాణ హైకోర్టు తీర్పు కాపీ   సీబీఐకి చేరింది. ఈ తీర్పును   డివిజన్ బెంచ్ లో  సిట్  సవాల్  చేసే అవకాశం ఉంది.

 BRS MLAs poaching Case: Telangana High Court  Verdict Reaches To CBI

హైదరాబాద్: ఎమ్మెల్యేల ప్రలోభాల కేసుపై తెలంగాణ  హైకోర్టు  ఇచ్చిన తీర్పు కాపీ  సీబీఐకి అందింది. ఈ కేసును సీబీఐ విచారణకు  ఆదేశిస్తూ ఈనెల  26వ తేదీన  తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.  ఈ కేసును సిట్  విచారణ చేస్తున్న విషయం తెలిసిందే.  సిట్ దర్యాప్తును  హైకోర్టు  నిలిపివేసింది.  ఈ కేసును విచారించాలని సీబీఐని ఆదేశించింది.  ఈ మేరకు  98 పేజీలతో  తెలంగాణ హైకోర్టు  తీర్పును  వెల్లడించింది. ఈ తీర్పు కాపీ  సీబీఐకి చేరింది.

ఈ ఏడాది  అక్టోబర్  26వ తేదీన మొయినాబాద్ ఫాం హౌస్ లో  నలుగురు బీఆర్ఎస్  ఎమ్మెల్యేలను   ప్రలోభాలకు గురి చేస్తూ  ముగ్గురు పోలీసులకు  చిక్కారు.  అచ్చంపేట ఎమ్మెల్యే  గువ్వల బాలరాజు,  కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి, పినపాక ఎమ్మెల్యే  రేగా కాంతారావు , తాండూరు ఎమ్మెల్యే  పైలెట్ రోహిత్ రెడ్డిలను  ప్రలోభాలకను ప్రలోభాలకు గురి చేశారని  ముగ్గురిని పోలీసులు అరెస్ట్  చేశారు.  రామచంద్రబారతి,  సింహాయాజీ నందకుమార్ లను మోయినాబాద్ పోలీసులు అరెస్ట్  చేశారు. తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి  ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసును విచారించేందుకు  తెలంగాణ ప్రభుత్వం సిట్ ను ఏర్పాటు చేసింది.  

ఈ కేసును  సీబీఐ లేదా  స్వతంత్ర్య దర్యాప్తు సంస్థతో విచారణ చేయించాలని బీజేపీ సహా మరో ఐదుగురు  తెలంగాణ హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు.ఈ పిటిషన్లపై  తెలంగాణ హైకోర్టు  సుదీర్థంగా విచారణ నిర్వహించింది.  ఈ నెల  16వ తేదీన తుది వాదనలను విన్నది.  ఈ నెల  26వ తేదీన  ఈ కేసు విషయమై   తెలంగాణ హైకోర్టు  తీర్పును వెల్లడించింది.  సిట్  విచారణ పారదర్శకంగా సాగడం లేదని హైకోర్టు అభిప్రాయపడింది.  ఈ కేసును విచారించాలని సీబీఐని ఆదేశించింది.  అయితే  ఈ విషయమై అప్పీల్ కు  సమయం ఇవ్వాలని  తెలంగాణ హైకోర్టును  ప్రభుత్వ తరపు న్యాయవాది కోరారు. ఈ విషయమై అప్పీల్  కు వెళ్లిన తర్వాతే సీబీఐ దర్యాప్తును ప్రారంభించే అవకాశం ఉంది.

also read:ఎమ్మెల్యేల ప్రలోభాల కేసు సీబీఐ విచారణకు తెలంగాణ హైకోర్టు ఒకే: అప్పీల్ కు వెళ్లే యోచనలో సిట్

ఈ కేసుకు సంబంధించి సిట్  అధికారులు  సేకరించిన  ఆధారాలను   సీబీఐ అధికారులకు అప్పగించాల్సి ఉంటుంది. సిట్ నుండి  అన్ని ఆధారాలు  అందిన తర్వాత  సీబీఐ అధికారులు కేసు నమోదు చేసే అవకాశం ఉంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ప్రలోభాల కేసులో  తెలంగాణ హైకోర్టు తీర్పును  హైకోర్టు డివిజన్ బెంచ్ లో  సిట్  సవాల్ చేసే అవకాశం ఉంది.  

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios