Asianet News TeluguAsianet News Telugu

కేసీఆర్ ముందు పేపర్ లీక్ వీరుడి కుప్పిగంతులు : బండి సంజయ్ పై బిఆర్ఎస్ ఎమ్మెల్యే సెటైర్స్

వరంగల్ లో తెలంగాణ బిజెపి చేపట్టిన నిరుద్యోగ మార్చ్ లో బండి సంజయ్ చేసిన కామెంట్స్ కు ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ కౌంటరిచ్చారు. 

BRS MLA Vinay Bhaskar satires on Telangana BJP chief Bandi Sanjay  AKP
Author
First Published Apr 16, 2023, 1:10 PM IST

వరంగల్ : తెలంగాణ బిజెపి వరంగల్ లో చేపట్టిన నిరుద్యోగ మార్చ్ పై స్థానిక బిఆర్ఎస్ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ స్పందించారు. టీఎస్ పిఎస్సి పేపర్ లీకులపై పోరాడుతున్నందుకే తనపై అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేసారన్న బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ కు ఎమ్మెల్యే కౌంటర్ ఇచ్చారు. దొంగే ఇతరులను దొంగ అన్నట్లుగా సంజయ్ తీరు వుందని... పదో తరగతి పేపర్ లీక్ చేసి ఇప్పుడు నిరుద్యోగ మార్చ్ అంటూ నాటకాలాడుతున్నారని ఆరోపించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ముందు ఈ లీక్ వీరుల గుప్పిగంతులు సాగవని ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ అన్నారు. 

నిన్న(శనివారం) వరంగల్ లో బీజేపీ చేపట్టింది నిరుద్యోగుల మార్చ్ కాదు అబద్దాల మార్చ్ అని వినయ్ భాస్కర్ ఎద్దేవా చేసారు. అసలు బిజెపికి నిరుద్యోగుల గురించి మాట్లాడే హక్కే లేదు... అలాంటి వారు ఎన్ని ఆందోళనలు చేపట్టినా ఎవరూ నమ్మరని అన్నారు. ఎన్నికల సమయంలో రెండు కోట్ల ఉద్యోగాలిస్తానని నిరుద్యోగ యువతను మోసం చేసిన ప్రధాని మోదీని నిలదీస్తూ డిల్లీలో ఆందోళన చేయాలని బిజెపి నాయకులకు బిఆర్ఎస్ ఎమ్మెల్యే సూచించారు. 
 
విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడిన పేపర్ లీకు వీరులు నిరుద్యోగ మార్చ్ చేయడం హాస్యాస్పదంగా వుందన్నారు వినయ్ భాస్కర్. బిజెపి మార్చ్ లో నిరుద్యోగులెవ్వరూ లేరు...అడ్డా కూలీలతో ఆందోళన చేపట్టారని అన్నారు. ఉద్యోగ నియామకాల కోసం నోటిపికేషన్స్ వెలువడటంతో నిరుద్యోగులంతా ప్రిపేర్ అవుతున్నారని అన్నారు. ప్రభుత్వం కల్పించిన వసతులతో నిరుద్యోగులు పరీక్షలకు సిద్ధమవుతున్నారని...రోడ్లమీదకు ఎవ్వరూ రాలేదన్నారు. 

Read More  నిరుద్యోగభృతి ఇవ్వండి.. కేసీఆర్ స‌ర్కారుకు వ్య‌తిరేకంగా బీజేపీ ర్యాలీ
 
 బీఆర్ఎస్ ది గాంధీ సిద్ధాంతంమైతే బీజేపీ ది గాడ్సే సిద్దాంతమని ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ అన్నారు. ప్రశాంతంగా ఉన్న తెలంగాణ లో బీజేపీ చిచ్చు పెట్టాలనుకుంటోందని ఆరోపించారు. మహనీయుడు బిఆర్ అంబేద్కర్ ఆలోచన విధానాలకు అనుగుణంగా విద్య, వైద్య రంగాలకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాధాన్యత ఇస్తున్నారని అన్నారు.ఇలా గొప్ప పాలన అందిస్తున్న కేసీఆర్ ను 
 గద్దె దిగాలని బీజేపీ నేతలు సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు.  కేసీఆర్ ఎందుకు కేసీఆర్ గద్దె దిగాలి? అన్నదాతలకు రైతు బంధు ఇస్తున్నందుకా? సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నందుకా? అంటూ ఎమ్మెల్యే నిలదీసారు. 

సీఎం కేసీఆర్ ప్రారంభించిన 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహం వద్దకు బీజేపీ నేతలు రావాలని... అక్కడే తెలంగాణ అభివృద్ధిపై చర్చిద్దామని వినయ్ భాస్కర్ సవాల్ విసిరారు. కేంద్రం చేసిన అభివృద్ధి ఏమిటో... రాష్ట్రం చేసిందేమిటో తేల్చుకుందామని అన్నారు. కులమతాల ఆధారంగా ప్రజలను బిజెపి విడగొడుతోందని... తెలంగాణలో వారి ఆటలు సాగనివ్వకుండా ఈ కుట్రలను బీఆర్ఎస్ తిప్పి కొడుతోందరని అన్నారు. 

బిజెపి నాయకులు వాగుతున్నట్లు కేసీఆర్ కుటుంబ పాలన సాగడం లేదని... తెలంగాణ కుటుంబ పాలన అమలవుతోందని వినయ్ భాస్కర్ అన్నారు. బీజేపీలో కుటుంబ రాజకీయాలు చాలా రాష్ట్రాల్లో జరుగుతున్నాయని అన్నారు. మాట్లాడితే కేసీఆర్ కుటుంబం గురించి మాట్లాడటం కాదు... దమ్ముంటే తెలంగాణ కంటే బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కువ సంక్షేమం అమలు చేసి చూపించాలని అన్నారు. దేశం కేసీఆర్ వైపు వస్తోంది... ఢిల్లీలో ఏర్పడేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని వినయ్ భాస్కర్  పేర్కొన్నారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios