Hyderabad: బీఆర్ఎస్ అంటేనే 'భారత రైతు సమితి' అని మంత్రి కేటీఆర్ అన్నారు. ముఖ్య‌మంత్రి కేసీఆర్ నాయ‌క‌త్వంలోని తెలంగాణ ప్ర‌భుత్వం రైతుల కోసం చేస్తున్న ప‌నుల‌ను ఆయ‌న ప్ర‌స్తావిస్తూ ఈ వ్యాఖ్య‌లు చేశారు. 

Hyderabad: కేసీఆర్ పై రైతులకు పూర్తి విశ్వాసం ఉందని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పేర్కొన్నారు. బీఆర్ఎస్ అంటేనే 'భారత రైతు సమితి' అని మంత్రి కేటీఆర్ అన్నారు. ముఖ్య‌మంత్రి కేసీఆర్ నాయ‌క‌త్వంలోని తెలంగాణ ప్ర‌భుత్వం రైతుల కోసం చేస్తున్న ప‌నుల‌ను ఆయ‌న ప్ర‌స్తావిస్తూ ఈ వ్యాఖ్య‌లు చేశారు. తెలంగాణలో ఈ ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. బీఆర్ఎస్ కు మెరుగైన ప్రత్యామ్నాయాన్ని అందిస్తామని బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు హామీ ఇస్తున్నాయి. ఈ క్ర‌మంలోనే కాంగ్రెస్, బీజేపీల‌ను టార్గెట్ చేస్తూ పొరపాటున ఇతరులను నమ్మితే తెలంగాణ నూరేళ్లు వెనక్కు వెళ్తుందని హెచ్చరించారు. 

దేశంలో ప్రతి ఎకరాకు రూ.10 వేల చొప్పున పెట్టుబడి సాయం అందించడంతో పాటు పంట నష్టానికి ఎకరాకు రూ.10 వేల చొప్పున పరిహారం ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని కేటీఆర్ అన్నారు. ఇటీవల కురిసిన అకాల వర్షాలు, వడగళ్ల వానలతో పంటలు దెబ్బతిన్న రైతులకు ప్రతి ఎకరాకు రూ.10 వేల చొప్పున పరిహారం ఇస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించడంపై కేటీఆర్ స్పందిస్తూ పై వ్యాఖ్య‌లు చేశారు. గురువారం ప్రభావిత జిల్లాల్లో పర్యటించిన సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుల‌కు పంట‌న‌ష్టం ప‌రిహారం ప్ర‌క‌ట‌న చేసిన సంగ‌తి తెలిసిందే. ఓ రైతును సీఎం కేసీఆర్ భుజాలపై చేతులు వేసి ఓదార్చుతున్న ఫొటోను సైతం కేటీఆర్ ట్విటర్ లో షేర్ చేశారు

Scroll to load tweet…

అలాగే, మహాత్మాగాంధీకి డిగ్రీ లేదంటూ జమ్మూకాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్ మరో ట్వీట్లో మండిపడ్డారు. వాట్సప్ యూనివర్శిటీ గ్రాడ్యుయేట్లు గాడ్సేకు నోబెల్ శాంతి బహుమతి అందించాలంటూ ప్రచారం ప్రారంభించినా ఆశ్చర్యపోనవసరం లేదంటూ ఎద్దేవా చేశారు.

Scroll to load tweet…