మంత్రి హరీశ్ పై అనుచిత వ్యాఖ్యలు.. ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావుకు బీఆర్ఎస్ షాక్.. !
Hyderabad: భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) అగ్రనేత, రాష్ట్ర మంత్రి హరీశ్ రావు పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఆ పార్టీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావును సస్పెండ్ చేసే అవకాశం ఉంది. ఇదే సమయంలో ఆయన కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లనున్నారని రాజకీయ వర్గాల్లో టాక్ నడుస్తోంది. హనుమంతరావుతో టీపీసీసీ నేతలు సంప్రదింపులు జరుపుతున్నారనీ, ఆయనకు మల్కాజిగిరి నుంచి పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం.
BRS may suspend Mynampally Hanumantha Rao: భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) అగ్రనేత, రాష్ట్ర మంత్రి హరీష్ రావు పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఆ పార్టీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావును సస్పెండ్ చేసే అవకాశం ఉంది. ఇదే సమయంలో ఆయన కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లనున్నారని రాజకీయ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. హనుమంతరావుతో టీపీసీసీ నేతలు సంప్రదింపులు జరుపుతున్నారనీ, ఆయనకు మల్కాజిగిరి నుంచి పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం.
వివరాల్లోకెళ్తే.. మంత్రి హరీశ్ రావుతో పాటు పార్టీ నాయకత్వంపై బహిరంగ వ్యాఖ్యలు చేసిన మైనంపల్లి హన్మంతరావును పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) అధిష్ఠానం భావిస్తోందని సమాచారం. మల్కాజ్ గిరి సిట్టింగ్ ఎమ్మెల్యే తన కుమారుడు రోహిత్ రావును మెదక్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయడానికి సీటు కేటాయించాలని డిమాండ్ చేశారు. అలాగే, తాను మల్కాజిగిరి నియోజకవర్గం నుంచి రెండోసారి పోటీ చేయాలని ఆయన ఆకాంక్షించారు. ఈ క్రమంలోనే మైనంపల్లి మంత్రి హరీశ్ రావు తో పాటు బీఆర్ఎస్ నాయకత్వాన్ని హచ్చరిస్తూ వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల బరిలో నిలిపే అభ్యర్థుల జాబితాను ప్రకటించారు. అయితే, మైనంపల్లి హనుమంతరావుపై వేటు వేసి.. నాంపల్లి, గోషామహల్, జనగామ, నర్సాపూర్ అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్థులతో పాటు మల్కాజిగిరికి కొత్త అభ్యర్థి పేరును సీఎం కేసీఆర్ అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని బీఆర్ఎస్ పార్టీ వర్గాల్లో పేర్కొంటున్నాయి.
మోతె శోభన్, మర్రి రాజశేఖర్ రెడ్డి, శోభన్ రెడ్డి, శంభీపూర్ రాజు సహా కనీసం నలుగురు వ్యక్తులు పార్టీ టికెట్ కోసం పోటీ పడుతున్నట్లు బీఆర్ఎస్ వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న రాజును నామినేట్ చేసేందుకు పార్టీ మొగ్గు చూపుతోందని సమాచారం. ఈ కీలక పరిణామాల నేపథ్యంలో మైనంపల్లిపై రాజకీయ విశ్లేషకులు భిన్నమైన అభిప్రయాలు వ్యక్తం చేస్తున్నారు.
అంతకుముందు, మంత్రి హరీశ్ రావు అక్రమంగా భారీగా ఆస్తులు కూడబెట్టారని మైనంపల్లి హనుమంతరావు ఆరోపించారు. అయితే, తన ఆరోపణలు పార్టీని ఉద్దేశించినవి కావని, ముఖ్యంగా తన రాజకీయ పంథాకు ఆటంకం కలిగిస్తున్న హరీశ్ రావును ఉద్దేశించి చేసినవేనని స్పష్టం చేస్తూ ఆయన ఆ తర్వాత తన వైఖరిని మార్చుకున్నారు. అయితే, అప్పటికే ఆయనకు జరగాల్సిన నష్టం జరిగిందనీ, పార్టీ దీనిని సీరియస్ గా తీసుకుందనీ, ఆయనపై వేటు వేయడం ఖాయమని ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.
ఈ పరిణామాల మధ్య టీపీసీసీకి చెందిన నేతలు హనుమంతరావుతో టచ్ లో ఉన్నారని, మల్కాజిగిరి నుంచి పోటీ చేసేందుకు ఆయనకు టికెట్ ఇవ్వాలని, ఆయన కుమారుడు రోహిత్ రావుకు మెదక్ టికెట్ ఇచ్చే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. పార్టీ అధినాయకత్వంతో ఎమ్మెల్యే సంప్రదింపులు జరుపుతున్నారని తెలిసింది.