బీఆర్ఎస్ పార్టీ, తెలంగాణ సీఎం కేసీఆర్‌లపై ప్రధాని నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్. జీహెచ్ఎంసీ ఎన్నికలకు ముందు పొత్తు కోసం బీజేపీతో  చర్చించలేదని.. ఎన్నికళ వేళ మోడీ ఇలాంటి మాటలే మాట్లాడుతారని వినోద్ దుయ్యబట్టారు. 

బీఆర్ఎస్ పార్టీ, తెలంగాణ సీఎం కేసీఆర్‌లపై ప్రధాని నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇన్ని రోజులు మాట్లాడకుండా మోడీ ఇప్పుడెందుకు మాట్లాడుతున్నారని ప్రశ్నించారు. అన్నింటికంటే ముందే కేసీఆర్‌ను రావొద్దని పీఎంవో ఎందుకు చెప్పిందో మోడీ సమాధానం చెప్పాలని వినోద్ కుమార్ నిలదీశారు. గతంలో భారత్ బయోటెక్‌కు వచ్చినప్పుడు ప్రధాని ఏం చేశారని ఆయన దుయ్యబట్టారు. జీహెచ్ఎంసీ ఎన్నికలకు ముందు పొత్తు కోసం బీజేపీతో చర్చించలేదని.. ఎన్నికళ వేళ మోడీ ఇలాంటి మాటలే మాట్లాడుతారని వినోద్ దుయ్యబట్టారు. తెలంగాణ వచ్చాక ఏ పార్టీతోనూ బీఆర్ఎస్ పొత్తు పెట్టుకోలేదని ఆయన స్పష్టం చేశారు.

అంతకుముందు నిజామాబాద్ జిల్లా ఇందూరులో జరిగిన బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోడీ సంచలన వ్యాఖ్యలు చేశారు. జీహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత కేసీఆర్ ఢిల్లీ వచ్చి తనను కలిశారని .. ఎన్డీయేలో చేరతామని అడిగారని తెలిపారు. అయితే జీహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత తెలంగాణ తరపున గట్టిగా పోరాడాలని బీజేపీ నిర్ణయించిందని ప్రధాని తెలిపారు. జీహెచ్ఎంసీ ఎన్నికలకు ముందు కేసీఆర్ తనకు స్వాగతం పలకడానికి వచ్చే వారని, జీహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత సీన్ మారిపోయిందన్నారు. జీహెచ్ఎంసీ మేయర్ పదవి బీజేపీకి ఇస్తానని కేసీఆర్ ఢిల్లీకి వచ్చి తనను అడిగారని ప్రధాని సంచలన వ్యాఖ్యలు చేశారు. 

Also Read: జీహెచ్ఎంసీ మేయర్ పదవి ఇస్తాం, ఎన్డీయేలో చేరతామని కేసీఆర్ అడిగారు.. కుదరదన్నా : బాంబు పేల్చిన మోడీ

తెలంగాణ ప్రజల డబ్బును కర్ణాటకలో ఖర్చు పెట్టారని మోడీ ఆరోపించారు. దక్షిణ భారతదేశాన్ని మోసం చేసేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని ఆయన ఫైర్ అయ్యారు. ఆలయాల సంపదను తీసుకుంటున్నారని.. కానీ మైనార్టీ ప్రార్ధనా స్థలాల జోలికి మాత్రం వెళ్లరని దుయ్యబట్టారు. కేసీఆర్ అవినీతి బాగోతాన్ని తాను చెప్పానని మోడీ గుర్తుచేశారు. కర్ణాటక ఎన్నికల తరహాలో బీఆర్ఎస్ డబ్బులు కుమ్మరించాలని చూస్తున్నారని ప్రధాని ఆరోపించారు. 

కేటీఆర్‌ను ఆశీర్వదించాలని కేసీఆర్ కోరారని.. ఇది రాజరికం కాదని తాను కేసీఆర్‌కు చెప్పానని ప్రధాని స్పష్టం చేశారు. ప్రజలు ఆశీర్వదించిన వారే పాలకులు అని తాను చెప్పానని మోడీ వెల్లడించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్‌లది ఒకటే సిద్ధాంతమని.. ఎన్నికలకు ముందు వాగ్థానాలు ఇవ్వడం, ఎన్నికల తర్వాత వాటిని మర్చిపోవడం వాళ్ల పాలసీ అని ప్రధాని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార దాహంతో కాంగ్రెస్ అల్లాడుతోందన్నారు. కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ నేతలకు బీఆర్ఎస్ డబ్బులు అందజేసిందని ప్రధాని ఆరోపించారు.