గణేష్ వేడుకలను బీఆర్ఎస్ రాజకీయాలకు వాడుకుంటోంది - బండి సంజయ్ కుమార్
గణేష్ మండపాల ఏర్పాటు కోసం బీఆర్ఎస్ ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గంలో కోట్లాది రూపాయిలు ఇచ్చిందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ ఆరోపించారు. ఈ ఉత్సవాలను బీఆర్ఎస్ తమ రాజకీయం కోసం ఉపయోగించుకుంటోందని అన్నారు.

గణేష్ వేడుకలను బీఆర్ఎస్ రాజకీయాల కోసం వాడుకుంటోందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ అన్నారు. మండపాల ఏర్పాటుకు ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఆ పార్టీ కోట్లాది రూపాయలు విరాళంగా ఇచ్చిందని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో ఓట్లను కొల్లగొట్టేందుకు సీఎం కేసీఆర్ అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నారని తెలిపారు. కరీంనగర్ లోని పలు కాలనీల్లో ఆదివారం ఆయన పలు గణేష్ మండపాలను పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
నిర్మాణంలో ఉన్న భనవం కూలి ఇద్దరు వలస కూలీలు దుర్మరణం.. హైదరాబాద్ శివారులో ఘటన
తెలంగాణలో జరిగిన ఉప ఎన్నికల్లో సీఎం కేసీఆర్ ఒక్కో ఓటుకు రూ.3 వేల నుంచి రూ.10 వేల వరకు పంపిణీ చేశారని బండి సంజయ్ ఆరోపించారు. పదేళ్ల పాలనలో కుంభకోణాలు, కుతంత్రాలు తప్ప కేసీఆర్ రాష్ట్ర ప్రజలకు చేసిందేమీ లేదని అన్నారు. గ్రూప్-1 పరీక్షల రద్దు పై ఆయన స్పందించారు. సీఎం లక్షలాది మంది విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడారని సంజయ్ కుమార్ అన్నారు. పోటీ పరీక్షలే కాదు, రాష్ట్రంలో టెన్త్, ఇంటర్ పరీక్షలను కూడా ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం సక్రమంగా నిర్వహించలేకపోతోందని తెలిపారు.
వయనాడ్ నుంచి కాదు.. హైదరాబాద్ నుంచి పోటీ చేసి గెలవాలి - రాహుల్ గాంధీకి ఒవైసీ సవాల్..
సీఎం కేసీఆర్ పాలనలో తమ పిల్లల భవిష్యత్తు అంధకారంలోనే ఉంటుందని యువత తల్లిదండ్రులు గ్రహించాలని బండి సంజయ్ కుమార్ అన్నారు. ఇప్పటికే మురళి ముదిరాజ్ అనే యువకుడు యూనివర్శిటీలో ఆత్మహత్య చేసుకున్నాడని, ఇది తల్లిదండ్రులను తీవ్రంగా కలచివేసిందని ఆవేదన వ్యక్త చేశారు.
మహాత్మా గాంధీ జయంతి.. అక్టోబర్ 1న గంట పాటు శ్రమదానం చేయాలని దేశ ప్రజలకు ప్రధాని పిలుపు
గ్రూప్-1 పరీక్షకు హాజరైన ప్రతీ అభ్యర్థికి రాష్ట్ర ప్రభుత్వం రూ.లక్ష మంజూరు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. నిరుద్యోగ యువతకు తదుపరి పరీక్షలకు హాజరయ్యేందుకు వయస్సులో సడలింపు ఇవ్వాలని అన్నారు. ప్రతీ నిరుద్యోగికి ఉద్యోగాలు వచ్చే వరకు నెలకు రూ.3,116 ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో మాదకద్రవ్యాల వాడకం ఎక్కువగా ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో పాటు సీఎం కేసీఆర్ మద్యాన్ని ప్రోత్సహిస్తున్నారని, దీని ప్రజలు మద్యానికి బానిసలు అవుతున్నారని ఆరోపించారు.