నిర్మాణంలో ఉన్న భనవం కూలి ఇద్దరు వలస కూలీలు దుర్మరణం.. హైదరాబాద్ శివారులో ఘటన
హైదరాబాద్ శివారులో విషాదం చోటు చేసుకుంది. నిర్మాణంలో ఉన్న భవనం కూలి ఇద్దరు వలస కార్మికులు మరణించారు. మరో నలుగురు కార్మికులకు గాయాలు అయ్యాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

నిర్మాణంలో ఉన్న భవనం కూలి ముగ్గురు వలస కూలీలు మరణించారు. పలువురికి గాయాలు అయ్యాయి. ఈ ఘటన హైదరాబాద్ శివారులోని రాచకొండ కమిషనరేట్ పహాడీషరీఫ్ పీఎస్ పరిధిలోని చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన ప్రకారం.. హబూబ్ నగర్ లో నివసించే సంజీవ్ ముదిరాజ్ కు మామిడిపల్లి గ్రామంలో స్థలం ఉంది. అయితే ఖాళీ స్థలంలో ఇంటిని నిర్మించాలని భావించారు.
వయనాడ్ నుంచి కాదు.. హైదరాబాద్ నుంచి పోటీ చేసి గెలవాలి - రాహుల్ గాంధీకి ఒవైసీ సవాల్..
ఈ నిర్మాణ పనుల కోసం ఓ కాంట్రాక్టర్ ను నియమించారు. ఆ కాంట్రాక్టర్ పలువురు కూలీలను నియమించుకొని భవనం నిర్మాణం ప్రారంభించారు. ఇప్పటికే మొదటి అంతస్తు స్లాబ్ వేయడం పూర్తయ్యింది. ఇక రెండో అంతస్తు పనులు మొదలయ్యాయి. ఆదివారం రెండో అంతస్తు స్లాబ్ వేసే పనులు చేస్తున్నారు.
మహాత్మా గాంధీ జయంతి.. అక్టోబర్ 1న గంట పాటు శ్రమదానం చేయాలని దేశ ప్రజలకు ప్రధాని పిలుపు
ఈ క్రమంలో ఆ భనవం ఒక్క సారిగా కూలిపోయింది. ఈ ఘటనలు ఒడిశాకు చెందిన జగదీష్ బి(40), ఉత్తరప్రదేశ్ కు చెందిన తిలక్ సింగ్(33) అక్కడికక్కడే మృతి చెందారు. మరో నలుగురు కార్మికులు గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఈ ఘటనపై ఐపీసీ సెక్షన్ 304ఏ (నిర్లక్ష్యం కారణంగా మరణం) కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పహాడీషరీఫ్ ఎస్ హెచ్ వో కె.సతీష్ తెలిపారు. ఘటనా స్థలంలో కార్మికుల కోసం ఎలాంటి భద్రతా చర్యలు లేవని పోలీసులు గుర్తించారు.