రోడ్డు ప్రమాదంలో లాస్యనందిత మృతి: నివాళులర్పించిన కేసీఆర్

సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత  పార్థీవదేహనికి పలువురు బీఆర్ఎస్ నేతలు నివాళులర్పించారు.

BRS Chief KCR Pays Tribute to secunderabad cantonment mla g.lasya nanditha

హైదరాబాద్: సికింద్రాబాద్  కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత పార్థీవ దేహనికి భారత రాష్ట్ర సమితి అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్) శుక్రవారం నాడు నివాళులర్పించారు.గాంధీ ఆసుపత్రిలో  ఎమ్మెల్యే లాస్య నందిత మృతదేహనికి  పోస్టుమార్టం నిర్వహించారు. పోస్టుమార్టం పూర్తైన తర్వాత  లాస్యనందిత పార్థీవదేహన్ని  ఆమె స్వగృహంలో  ఉంచారు.  భారత రాష్ట్ర సమితి శ్రేణులు, పార్టీ కార్యకర్తలు లాస్య నందితను కడసారి చూసేందుకు భారీగా తరలి వచ్చారు.

also read:గాంధీలో పూర్తైన పోస్టుమార్టం: తండ్రి సమాధి పక్కనే లాస్య నందిత అంత్యక్రియలు

ఇవాళ మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో భారత రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ లాస్యనందిత  పార్థీవ దేహంపై పూలమాల వేసి  నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను ఓదార్చారు. 

 

ఇవాళ తెల్లవారుజామున పటాన్ చెరు ఔటర్ రింగ్ రోడ్డు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో  లాస్య నందిత మృతి చెందారు.  ఈ ప్రమాదం విషయం తెలిసిన వెంటనే పోలీసులు లాస్య నందితను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.ఆసుపత్రిలో వైద్యులు లాస్య నందితను పరీక్షించారు. అప్పటికే ఆమె మృతి చెందిన విషయాన్ని వైద్యులు ప్రకటించారు. 

also read:రోడ్డు ప్రమాదంలో కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యనందిత మృతి: అతి వేగమే కారణమా?

ఎమ్మెల్యే లాస్య నందిత మృతదేహనికి గాంధీ ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. అక్కడి నుండి  కార్ఖానాలోని ఆమె స్వగృహనికి తరలించారు.  ఇవాళ సాయంత్రం  అధికారిక లాంఛనాలతో  లాస్యనందిత అంత్యక్రియలను నిర్వహించనున్నారు. తండ్రి సమాధి పక్కనే లాస్య నందిత అంత్యక్రియలను నిర్వహించాలని కుటుంబ సభ్యులు నిర్ణయించారు.అధికారిక లాంఛనాలతో లాస్యనందిత అంత్యక్రియలను నిర్వహించాలని  తెలంగాణ సీఎం అనుముల రేవంత్ రెడ్డి  అధికారులను ఆదేశించారు.


 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios