Asianet News TeluguAsianet News Telugu

మేడిగడ్డ బ్యారేజీ పరిశీలనకు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు: బీజేపీ, బీఆర్ఎస్ దూరం

మేడిగడ్డ బ్యారేజీ పరిశీలనకు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను ప్రభుత్వం తీసుకెళ్లింది. అయితే ఈ టూర్ కు  బీజేపీ, బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు దూరంగా ఉన్నారు.

BRS and BJP MLAs skips visit of Medigadda barrage lns
Author
First Published Feb 13, 2024, 1:00 PM IST | Last Updated Feb 13, 2024, 1:00 PM IST


హైదరాబాద్: మేడిగడ్డ బ్యారేజీ పరిశీలనకు తెలంగాణ ప్రభుత్వం  మంగళవారంనాడు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను తీసుకెళ్లింది. అయితే  ఈ పర్యటనకు  భారత రాష్ట్ర సమితి,  భారతీయ జనతా పార్టీలు దూరంగా ఉన్నాయి. కేఆర్ఎంబీకి ప్రాజెక్టులను అప్పగించడాన్ని నిరసిస్తూ  ఇవాళ చలో నల్గొండకు భారత రాష్ట్ర సమితి  పిలుపునిచ్చింది. నల్గొండలో భారీ బహిరంగ సభను నిర్వహించనుంది బీఆర్ఎస్.

also read:ఇసుకతో పేకమేడలు నిర్మించారా: మేడిగడ్డ బ్యారేజీపై అసెంబ్లీలో రేవంత్ రెడ్డి

 ఈ సభలో కేసీఆర్ పాల్గొంటారు. కేఆర్ఎంబీకి ప్రాజెక్టులు అప్పగిస్తే  జరిగే నష్టంపై  ప్రజలకు ఈ సభ ద్వారా వివరించనుంది  బీఆర్ఎస్. అయితే  అదే సమయంలో  కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నిర్మించిన మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు కుంగిపోయాయి.ఈ విషయాన్ని ప్రజలకు వివరించాలని  కాంగ్రెస్ సర్కార్ భావిస్తుంది.  ఇవాళ తెలంగాణ అసెంబ్లీ, శాసనమండలి సభ్యులను మేడిగడ్డకు తీసుకెళ్లింది కాంగ్రెస్ సర్కార్. అయితే ఈ కార్యక్రమానికి బీజేపీ, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు దూరంగా ఉన్నారు.

also read:హైద్రాబాద్ ఉమ్మడి రాజధాని: గడువు పెంచాలంటున్న వైఎస్ఆర్‌సీపీ, అందరి చూపు కాంగ్రెస్ వైపే

నల్గొండలో సభ ఉన్నందున ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ దూరంగా ఉంది. మరో వైపు మేడిగడ్డ బ్యారేజీ దెబ్బతిన్న పిల్లర్లను ఎన్నికల సమయంలోనే  బీజేపీ నేతలు పరిశీలించారు.  కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి  ఈ విషయమై  కేంద్ర జల్ శక్తి మంత్రిత్వశాఖకు లేఖ రాశారు.

 

కేంద్ర ప్రభుత్వం నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ  బృందాన్ని పంపింది. ఈ బృందం మేడిగడ్డ బ్యారేజీని పరిశీలించి  నివేదికను అందించింది. గతంలోనే బీజేపీ నేతలు ఈ బ్యారేజీని పరిశీలించినందున  ఇవాళ ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమానికి దూరంగా ఉన్నారు. ఈ టూర్ తర్వాతనైనా  సీబీఐ విచారణను  ప్రభుత్వం కోరాలని బీజేపీ ఎమ్మెల్యేలు కోరుతున్నారు.

 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios