Asianet News TeluguAsianet News Telugu

చెల్లిని ప్రేమించాడని కత్తితో పొడిచారు. ఆ తరువాత ఆస్పత్రిలో చేర్పించి..

వారిద్దరి కులాలు ఒక్కటే.. కానీ వారి ప్రేమ అమ్మాయి అన్నలకు నచ్చలేదు. అంతే యువకుడిని కత్తితో పొడిచారు. ఆ తరువాత ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ యువకుడు మృతి చెందాడు. 

brothers killed sister lover in mahabubnagar
Author
Hyderabad, First Published Aug 11, 2022, 2:01 PM IST

మహబూబ్ నగర్ : తన చెల్లిని ప్రేమించిన యువకుడిని ఆమె సోదరులు దారుణంగా హత్య చేసిన సంఘటన మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మండలం కిష్టారం గ్రామంలో చోటు చేసుకుంది. సీఐ రమేష్ బాబు తెలిపిన వివరాల ప్రకారం…మండల పరిధిలోని కిష్టారం గ్రామానికి చెందిన సింగిదాస్ కృష్ణ (24) అదే గ్రామానికి చెందిన యువతి నందిని (17) ప్రేమించుకున్నారు. ఇద్దరిదీ ఒకే కులం. దీంతో  తమ కుటుంబాల్లో సమస్య కాదు అనుకున్నారేమో మరింత దగ్గరయ్యారు.

అయితే, ఈ విషయం ఆ యువతి సోదరులు సింగి దాస్ మోహన్, సింగి దాస్ విజయ్ లకు తెలిసింది. కాగా,  మంగళవారం రాత్రి మొహర్రం వేడుకల్లో అందరూ నిమగ్నమైన సమయంలో వారు అతడిని అంతమొందించాలని ప్లాన్ వేశారు. గ్రామ శివార్లలో ఉన్న మొక్కజొన్న చేను లో కలుసుకోవాలని కృష్ణ, నందిని వెళ్లారు. అదను కోసం ఎదురు చూస్తున్న సోదరులు ఇది గమనించారు. వారిద్దరి వెనకే సోదరులు కూడా అక్కడికి చేరుకున్నారు. అక్కడ కృష్ణ కడుపులో కత్తితో పొడిచారు. దీంతో పేగులు, పొట్టలోని అవయవాలు బయటకు వచ్చాయి.  

బీహార్ పరిణామాలతో కొత్త అస్త్రం.. జాతీయ రాజకీయాల్లో మరింత దూకుడు పెంచనున్న కేసీఆర్!

తనను ఎలాగైనా కాపాడాలని కృష్ణ వారిద్దరిని వేడుకున్నాడు. దీంతో వారు 108 అంబులెన్స్ కు సమాచారం ఇచ్చి, వెంటనే చికిత్స కోసం మహబూబ్ నగర్ సమీపంలోని ఏనుగొండ ఎస్ వీఎస్ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా మారడంతో హైదరాబాదులోని ఉస్మానియా ఆస్పత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం ఉదయం ఎనిమిది గంటలకు కృష్ణ మృతిచెందాడు. కృష్ణ ఆటో నడుపుతుంటాడని తల్లిదండ్రులు జంగమ్మ, బాలయ్య కన్నీరుమున్నీరయ్యారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ తెలిపారు. నిందితులు జడ్చర్ల పోలీసుల ముందు లొంగిపోయినట్లు సమాచారం. 

ఇదిలా ఉండగా, నిజామాబాద్ లో అన్నా చెల్లెలుగా ఉంటున్న తమ మీద ప్రేమికుల అంటూ ముద్ర వేశారని మనస్తాపం చెందిన ఓ ఇద్దరు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. నందిపేట్ కు చెందిన యువకుడు (22) నిజామాబాదులో ల్యాబ్ టెక్నీషియన్ గా పని చేస్తున్నాడు. అదే మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలిక (17)  నిజామాబాదులో పాలిటెక్నిక్ రెండో సంవత్సరం చదువుతోంది. ఒకే ఊరు కావడంతో ఇద్దరికీ పరిచయం ఏర్పడింది. వీళ్ళిద్దరూ తరచుగా మాట్లాడుకుంటూ ఉండటం, కలుసుకుంటూ ఉండటంతో కొంతమంది వీరిని ప్రేమికులు అంటూ  ప్రచారం చేయడం మొదలు పెట్టారు. దీంతో వీరిద్దరు మనస్తాపం చెందారు. 

తామిద్దరూ అన్నాచెల్లెళ్లలాగా ఉంటున్నామని..  ఇలా ప్రచారం చేయడంతో  తాము తీవ్రంగా బాధ పడ్డామని ఉత్తరం రాసి.. ఈ నెల 8న.. రాత్రి 8 గంటలకు జిల్లా కేంద్రంలోని గిరిరాజ్ డిగ్రీ కాలేజీ దగ్గరికి చేరుకున్నారు. అక్కడే ఇద్దరు  గడ్డి మందు తాగి  ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించారు. అయితే అటుగా వెడుతున్న స్థానికులు వీరిని గుర్తించారు. వీరి ప్రయత్నం గమనించి వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత ఇరు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ యువకుడు బుధవారం ఉదయం మృతి చెందాడు. బాలిక ఆసుపత్రిలో కోలుకుంటోంది. 

Follow Us:
Download App:
  • android
  • ios