హైదరాబాద్: బోయిన్‌పల్లి కిడ్నాప్ కేసులో నిందితులను గోవాలో కొందరిని అరెస్ట్ చేశారు.  గోవాలో అరెస్టైన నిందితులను మంగళవారం నాడు రాత్రికి హైద్రాబాద్ కు తరలించే అవకాశం ఉంది.

ఈ నెల 5వ తేదీన బోయిన్ పల్లిలో ప్రవీణ్ రావు అతని సోదరులను కొందరు దుండగులు  కిడ్నాప్ చేశారు.ఈ కిడ్నాప్ కేసులో ఏపీకి చెందిన మాజీ మంత్రి భూమా అఖిలప్రియతో పాటు పలువురిని హైద్రాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు..

also read:కిడ్నాప్ కోసం తాత్కాలిక సిమ్ వాడిన అఖిలప్రియ: సీపీ అంజనీకుమార్

కిడ్నాప్ చేసిన నిందితుల్లో 16 మందిలో ఇప్పటికే కొందరిని అరెస్ట్ చేశారు పోలీసులు. మిగిలిన నిందితుల కోసం పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ విచారణలో ఇవాళ భాగంగా  విజయవాడలోని నిందితుల ఇళ్లకు వెళ్లిన పోలీసులకు గాను నిందితులు గోవాలో ఉన్నారనే సమాచారం తెలిసింది.

ఈ సమాచారం ఆధారంగా గోవాలో ఉన్న నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. మరికొందరిని విజయవాడలో అదుపులోకి తీసుకొన్నారు. విజయవాడతో పాటు గోవాలో అదుపులోకి తీసుకొన్న వారిని ఇవాళ రాత్రికి హైద్రాబాద్ కు తరలించనున్నారు.