హైదరాబాద్‌లోని పబ్‌లు ఇటీవలి కాలంలో వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతున్నాయి. మొన్నామధ్య బంజారాహిల్స్‌లోని రాడిసన్ బ్లూ హోటల్ ఆవరణలోని ఫుడింగ్ మింక్ పబ్‌లో రేవ్ పార్టీ కలకలం రేపింది. తాజాగా జూబ్లీహిల్స్‌లోని ప్రిజం పబ్‌లో కస్టమర్‌పై బౌన్సర్లు దాడి చేశారు. 

హైదరాబాద్‌ (hyderabad) జూబ్లీహిల్స్ (jubilee hills) ప్రిజం పబ్‌లో (prism pub) దారుణం జరిగింది. నందకిశోర్ (nanda kishore) అనే కస్టమర్‌పై బౌన్సర్లు విచక్షణారహితంగా దాడి చేశారు. మొత్తం ముగ్గురు బౌన్సర్లు సదరు కస్టమర్‌పై తమ ప్రతాపం చూపారు. బౌన్సర్లతో పాటు పబ్ యజమానులు కూడా కస్టమర్‌పై రెచ్చిపోయి దాడి చేశారు. కింద పడేసి చితకబాదారు. స్మోకింగ్ చేయొద్దని చెప్పినప్పటికీ నంద కిశోర్ స్మోక్ చేశాడన్న కారణంతో వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపై జరిగిన దాడిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు నంద కిశోర్. ఇందుకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred