హైదరాబాద్ మాదాపూర్‌లోని ప్రముఖ సాఫ్ట్‌వేర్ కంపెనీ టీసీఎస్‌కు బాంబు బెదిరింపు కాల్ వ‌చ్చింది. టీసీఎస్ కంపెనీలో బాంబు పెట్టిన‌ట్లు గుర్తుతెలియని వ్యక్తి  నుంచి ఫోన్ కాల్ రావడంతో యాజమాన్యం అప్రమత్తమైంది.

హైదరాబాద్ మాదాపూర్‌లోని ప్రముఖ సాఫ్ట్‌వేర్ కంపెనీ టీసీఎస్‌కు బాంబు బెదిరింపు కాల్ వ‌చ్చింది. టీసీఎస్ కంపెనీలో బాంబు పెట్టిన‌ట్లు గుర్తుతెలియని వ్యక్తి నుంచి ఫోన్ కాల్ రావడంతో యాజమాన్యం అప్రమత్తమైంది. వెంటనే పోలీసులకు సమాచారం అందించింది. ఉద్యోగులను బయటకు పంపింది. పోలీసులు వెంటనే బాంబ్‌స్క్వాడ్‌తో టీసీఎస్ కంపెనీకి చేరుకున్నారు. కంపెనీలో విస్తృతంగా తనిఖీలు చేపట్టిన అనంతరం అక్కడ ఎలాంటి బాంబు లేదని నిర్దారించారు. దీంతో ఉద్యోగులు, కంపెనీ యాజమాన్యం ఊపిరి పీల్చుకున్నారు. 

అయితే బాంబు ఉందని బెదిరింపు కాల్ చేసిన వ్యక్తి ఎవరనే విషయాన్ని పోలీసులు ఆరా తీశారు. గతంలో కంపెనీ సెక్యూరిటీ విభాగంలో పనిచేసిన ఉద్యోగి ఈ పని చేసినట్టుగా ప్రాథమిక నిర్దారణకు వచ్చారు. దీంతో ఆ వ్య‌క్తిని ప‌ట్టుకునేందుకు పోలీసులు య‌త్నిస్తున్నారు.