హైదరాబాద్: బోయిన్ పల్లి కిడ్నాప్ కేసులో నిందితులైన మాజీ మంత్రి, టీడీపీ నేత భూమా అఖిలప్రియ భర్త భార్గవ్ రామ్ పోలీసుల చేతికి చిక్కినట్లు వార్తలు వస్తున్నాయి. ఆయనను పోలీసులు రహస్య ప్రదేశంలో విచారిస్తున్నట్లు సమాచారం. ఆయనతో పాటు కిడ్నాప్ వ్యవహారంలో కీలక పాత్ర పోషించిన మాదాల శ్రీనివాస చౌదరి అలియాస్ గుంటూరు శ్రీను కూడా పోలీసులకు చిక్కినట్లు చెబుతున్నారు. 

కిడ్నాప్ లో పాల్గొన్నవారి గురించి, సూత్రధారుల గురించి భార్గవ్ రామ్ ను పోలీసులు విచారిస్తున్నట్లు తెలు్సతోంది. బోయిన్ పల్లి కిడ్నాప్ కేసులో పోలీసులు 19 మంది నిందితులను గుర్తించారు. అఖిలప్రియను పోలీసులు సోమవారం అరెస్టు చేయగా, తాజాగా మరో నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. మిగతా 11 మందిలో భార్గవ్ రామ్, గుంటూరు శ్రీను ఉన్నట్లు, వారి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు చెబుతున్నారు. వారిని త్వరలోనే అరెస్టు చేస్తామని అంటున్నారు. 

Also Read: మా ఆయన ఎక్కుడున్నాడో తెలియదు, గుంటూరు శ్రీనుతో అందుకే మాట్లాడా: అఖిలప్రియ

గోవాలో హైదరాబాద్ ఉత్తర, పశ్చిమ మండలం పోలీసుుల ఒక నిందితుడిని అరెస్టు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లా కొండపల్లికి చెందిన వైసీపీ నేత వెంకటేశ్వర రావు కుమారులు వంశీ, సాయిహర్షలతో పాటు టీ. భాను అనే యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారంతా కిడ్నాప్ లో ప్రత్యక్షంగా పాల్గొన్నట్లు పోలీసులు చెబుతున్నారు. 

గుంటూరు శ్రీను వారికి కిడ్నాప్ స్కెచ్ ను వివరించి, హైదరాబాదుకు రప్పించినట్లు పోలీసులు గుర్తించారు. కేసులో అఖిలప్రియ సోదరుడు జగత్ విఖ్యాత్ ప్రమేయం కూడా ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కిడ్పాప్ వ్యవహారంలో అతని డ్రైవర్ ప్రత్యక్షంగా పాల్గొన్నట్లు పోలీసులు గుర్తించారని అంటున్నారు. అఖిలప్రియ అరెస్టు సమయంలో జగత్ విఖ్యాత్ ను పోలీసులు ప్రశ్నించారు.

Also Read: బోయిన్‌పల్లి కిడ్నాప్: గోవాలో నిందితుల ఎంజాయ్: అరెస్ట్, హైద్రాబాద్‌కి తరలింపు

హఫీజ్ పేట భూవివాదంపై భూమా కుటుంబ సభ్యులు, ప్రవీణ్ రావు కుటుంబ సభ్యులు గతంలో బెంగళూరులో పలుమార్లు చర్చలు జరిపినట్లు పోలీసులు భావిస్తున్నారు. కిడ్నాప్ నకు కొన్ని రోజుల ముందు కూడా ఇరు వర్గాల మధ్య చర్చలు జరిగినట్లు చెబుతున్నారు. ఈ సమావేశాల్లో కొంత మంది మధ్యవర్తులు పాల్గొన్నట్లు తెలుస్తోంది. వారిని గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. చర్చలు విఫలం కావడం వల్లనే కిడ్నాప్ నకు అఖిలప్రియ వర్గం పాల్పడినట్లు భావిస్తున్నారు.