Asianet News TeluguAsianet News Telugu

చాదర్‌ఘాట్ ‘‘తల’’ కేసు: బాకీ తీర్చమన్నందుకు హత్య .. వివాహేతర సంబంధం సైతం...

హైదరాబాద్ చాదర్‌ఘాట్‌లో కొద్దిరోజుల క్రితం దొరికిన మొండెం లేని తల మిస్టరీ వీడింది. ఆ తల కేర్ ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తున్న నర్సు ఎర్రం అనూరాధదిగా గుర్తించారు పోలీసులు. బాకీ తీర్చమన్నందుకు నిందితుడు చంద్రమౌళి ఆమెను దారుణంగా హత్య చేశాడు. 

bodyless head found in malakpet case updates ksp
Author
First Published May 24, 2023, 5:51 PM IST

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన చాదర్‌ఘాట్ మొండెం లేని తల కేసును హైదరాబాద్ పోలీసులు ఛేదించారు. దీనికి సంబంధించిన వివరాలను డీసీపీ మీడియాకు వివరించారు. మృతురాలు ఎర్రం అనూరాధ రెడ్డి (55) గతంలో కేర్ ఆసుపత్రిలో నర్సుగా పనిచేసినట్లు ఆయన తెలిపారు. ఈ క్రమంలో నిందితుడు తండ్రికి ఒక సర్జరీ జరగ్గా.. ఆ సమయంలోనే మృతురాలితో నిందితుడు చంద్రమౌళికి పరిచయం ఏర్పడినట్లు డీసీపీ చెప్పారు.

ఆమెకు తన ఇంటిలోనే ఓ గది అద్దెకు ఇచ్చాడని.. అనంతరం తన అవసరాల నిమిత్తం ఇప్పటి వరకు రూ.7 లక్షలను తీసుకున్నాడని ఆయన తెలిపారు. ఆమెతో వివాహేతర సంబంధం కూడా పెట్టుకున్నాడు. ఈ క్రమంలో తన బాకీ తీర్చాల్సిందిగా అనూరాధ కోరడంతో చంద్రమౌళి దాట వేస్తూ వచ్చాడు. అయితే ఆమె నుంచి ఒత్తిడి పెపరగడంతో అనూరాధను చంపాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో మే 12న మరోసారి డబ్బు గురించి ఇద్దరి మధ్యా వాగ్వాదం జరగ్గా.. చంద్రమౌళి ఆమెను హతమార్చాడు. 

అనంతరం నేరం తనపై పడకుండా, ఆధారాలు మాయం చేసేందుకు యత్నించాడు. దీనిలో భాగంగా స్టోన్ కటింగ్ చేసే మెషిన్‌ల సాయంతో అనూరాధ మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా కట్ చేశాడు. ఈ నేపథ్యంలోనే తలను మే 17న చాదర్‌ఘాట్ సమీపంలోని మూసీ తీరంలో పడేశాడు. మిగిలిన శరీర భాగాలు బయటకు కనిపించకుండా ఫ్రిజ్‌లో దాచాడు. వాటిలో కొన్నింటిని కెమికల్స్ వాడి డిస్పోజ్ చేసేందుకు ప్రయత్నించాడు. ఇందుకోసం ఆన్‌లైన్‌లో సెర్చ్ చేసేవాడు .

ALso Read: వీడిన చాదర్‌ఘాట్‌ ‘‘ మొండెం లేని తల ’’ మిస్టరీ.. నర్సును ముక్కలు చేసి, ఫ్రిజ్‌లో డెడ్ బాడీ

శరీర భాగాల నుంచి దుర్వాసన రాకుండా కర్పూరం పౌడర్, పర్‌ఫ్యూమ్ చల్లడంతో పాటు ఎప్పటికప్పుడు పినాయిల్‌తో కడిగేవాడు. అంతేకాదు.. అనూరాధ బతికే వుందని నమ్మించేందుకు గాను ఫోన్‌ను అతనే వాడుతూ, మెసేజ్‌లు పెట్టడం, వాటికి రిప్లయ్ ఇవ్వడం చేసేవాడు. అనూరాధకు ఒకు కుమార్తె, ఆమెను తన అక్కకే దత్తతకు ఇచ్చింది. ఈ లోగా తల పోలీసులకు దొరకడంతో వారు దర్యాప్తును ప్రారంభించారు. 8 బృందాలను రంగంలోకి దించారు. రాష్ట్రంలోని అన్ని పోలీస్ స్టేషన్‌లలో మిస్సింగ్ కేసులను పరిశీలించారు. ఎక్కడా ఏ ఆధారం లభించకపోవడంతో సీసీ కెమెరా ఫుటేజ్‌లను విశ్లేషించారు.

ఈ క్రమంలో మంగళవారం పోలీసులకు ఓ క్లూ దొరికింది. మూసీ నది వద్ద ఓ వ్యక్తి అనుమానాస్పదంగా సంచరిస్తున్న విషయాన్ని పసిగట్టి.. అతని ద్వారా నిందితుడి ఆచూకీని కనిపెట్టి ఈరోజు అరెస్ట్ చేశారు. మృతురాలి ఫోన్‌లో వున్న ఫోటోలు, తల మ్యాచ్ కావడంతో పోలీసులు కేసును ఛేదించగలిగారు. పోలీసులు అరెస్ట్ చేయడం ఆలస్యం అయ్యుంటే అనూరాధ శరీర భాగాలను డిస్పోజ్ చేసేవాడు. రాచకొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని చైతన్య పురిలో ఈ హత్య జరిగిన నేపథ్యంలో కేసును అక్కడికి బదిలీ చేస్తామని డీసీపీ వెల్లడించారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios