Asianet News TeluguAsianet News Telugu

పిచ్చి పిచ్చి వేషాలు వేయొద్దు : రాజాసింగ్‌కు టీఆర్ఎస్ ఎమ్మెల్యే షకిల్ వార్నింగ్

బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు వార్నింగ్ ఇచ్చారు బోధన్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే షకీల్. మునావర్ గురించి రాజాసింగ్ ఓ వీడియో చేశారని.. మునావర్ హైదరాబాద్‌కు ఎందుకు రావొద్దని ఆయన ప్రశ్నించారు. రాజాసింగ్ మత చిచ్చులు పెడుతున్నారని షకీల్ మండిపడ్డారు. 
 

bodhan trs mla shakeel warns bjp mla raja singh
Author
Hyderabad, First Published Aug 23, 2022, 2:23 PM IST

గోషా మహాల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు వార్నింగ్ ఇచ్చారు బోధన్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే షకీల్. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో బీజేపీ పిచ్చిపిచ్చి వేషాలు వెయ్యొద్దని షకీల్ హెచ్చరించారు. మునావర్ గురించి రాజాసింగ్ ఓ వీడియో చేశారని.. మునావర్ హైదరాబాద్‌కు ఎందుకు రావొద్దని ఆయన ప్రశ్నించారు. రాజాసింగ్ మత చిచ్చులు పెడుతున్నారని షకీల్ మండిపడ్డారు. 

అంతకుముందు ధర్మం కోసం తాను చావడానికైనా సిద్దమని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ప్రకటించారు. మహ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారనే విషయమై హైద్రాబాద్ డబీర్ పురా పోలీస్ స్టేషన్ లో రాజాసింగ్ పై కేసు నమోదైంది. ఈ విషయమై రాజాసింగ్ మంగళవారం నాడు అరెస్ట్ కావడానికి కొద్దిసేపు ముందు ఆయన మీడియాతో మాట్లాడారు. తనపై ఎలాంటి  చర్యలకు దిగినా కూడా తాను సిద్దంగా ఉన్నాని ఆయన తేల్చి చెప్పారు. హైద్రాబాద్ లో మునావర్ ఫరూఖీ షో నిర్వహించవద్దని హెచ్చరించినా కూడా షో నిర్వహించడాన్ని రాజాసింగ్ తప్పుబట్టారు. 

Also REad:ధర్మం కోసం చావడానికైనా సిద్దమే: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్

ఈ కార్యక్రమాన్ని నిర్వహించవద్దని తాను  పోలీసులకు ముందే దండం పెట్టి  కూడా వినలేదని రాజాసింగ్ గుర్తు చేశారు. రాముడిని కించపర్చిన వ్యక్తికి పోలీసులు ఎలా రక్షణ కల్పిస్తారని రాజాసింగ్ ప్రశ్నించారు. మునావర్ ఫరూఖీకి కౌంటర్ వీడియోలు చేస్తానని ముందే చెప్పానన్నారు.  మునావర్ ఫరూఖీ పై రెండో భాగం వీడియోను త్వరలోనే అప్ లోడ్ చేస్తానని కూడా రాజాసింగ్ తేల్చి చెప్పారు. యాక్షన్ కు రియాక్షన్ ఉంటుందని రాజాసింగ్ చెప్పారు.

తాను ఎవరి పేరును తీసుకొని వ్యాఖ్యలు చేయలేదని బీజేపీ ఎమ్మెల్యే చెప్పారు. అయినా కూడా తనపై ఎలా కేసు నమోదు చేస్తారని రాజాసింగ్ ప్రస్తావించారు. మునావర్ ఫరూఖీ మాత్రం ఓ వర్గం దేవతలను కించపర్చారని ఆయన గుర్తు చేశారు. కానీ తాను మాత్రం ఎవరిని కూడా ఉద్దేశించి వ్యాఖ్యలు చేయలేదని రాజాసింగ్ తెలిపారు. తాను ఏం చేశానని తన ఇంటి ముందు భారీగా పోలీసులను మోహరించారని ఎమ్మెల్యే ప్రశ్నించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios